...
...
Next Story

IRCTC Araku Tour : అరకు ట్రిప్ వెళ్తారా..? బడ్జెట్ ధరలో 3 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

IRCTC Araku Tour Package : వైజాగ్ నుంచి అరకు టూర్ ప్యాకేజీ వచ్చింది. డిసెంబర్ 12, 2025వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 3 రోజుల పాటు సాగే జర్నీ… అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించవచ్చు.

Published on: Mar 10, 2026, 13:11:32 IST
Advertisement

అందమైన ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన అరకును చూడాలనుకుంటున్నారా..? మీకోసం విశాఖపట్నం నుంచి ఓ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. 3 రోజుల పాటు ఉండే ఈ టూర్ ప్యాకేజీని… ‘విశాఖపట్నం - అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ’ పేరుతో ఆపరేట్ చేస్తున్నారు.

అరకు
అరకు

IRCTC టూరిజం వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం… ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 15 మార్చి, 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి. ఆసక్తి గల టూరిస్టులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

విశాఖ టు అరకు - టూర్ షెడ్యూల్ :

  • మొదటి రోజు విశాఖలోని ఓ హోటల్ కు తీసుకెళ్తారు. ఇక్కడ ఫ్రెషప్ అయిన తర్వాత… భోజనం చేస్తారు. అక్కడ్నుంచి తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్ కు వెళ్తారు. సాయంత్రం హోటల్ కు చేరుకుంటారు. డిన్నర్ తర్వాత విశాఖలోనే ఉంటారు.
  • రెండో రోజు టిఫిన్ తర్వాత అరకు(ఉదయం 8 వరకు)కు చేరుకుంటారు. ఇక్కడ పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లానిటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, ప్రఖ్యాత బొర్రా కేవ్స్ సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి విశాఖపట్నంకు చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
  • మూడో రోజు టిఫిన్ తర్వాత తర్వాత విశాఖలో సబ్ మెరైన్ మ్యూజియం చేస్తారు. ఈ మ్యూజియం సోమవారం తెరిచి ఉండదు.ఆ తర్వాత రామానాయుడు స్టూడియోను కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత టూర్ ప్యాకేజీ కంప్లీట్ అవుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks