...
...
Next Story

విశాఖ టు అరకు - బడ్జెట్ ధరలోనే 3 రోజుల టూర్ ప్యాకేజీ..! ఇవిగో వివరాలు

వైజాగ్ నుంచి అరకు టూర్ ప్యాకేజీ వచ్చింది. డిసెంబర్ 12, 2025వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 3 రోజుల పాటు సాగే జర్నీ… అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించవచ్చు.

Published on: Dec 7, 2025, 12:20:30 IST
Advertisement

అందమైన ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన అరకును చూడాలనుకుంటున్నారా..? అయితే మీకోసమ విశాఖపట్నం నుంచి ఓ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం సిద్దమైంది.

హైదరాబాద్ - అరకు టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - అరకు టూర్ ప్యాకేజీ

IRCTC టూరిజం…. ‘విశాఖపట్నం - అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ 12 డిసెంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.

టూర్ షెడ్యూల్ వివరాలు:

  • డే 1 : టికెట్లు బుకింగ్ చేసుకున్న టూరిస్టులను విశాఖలోని ఓ హోటల్ కు తీసుకెళ్తారు. ఇక్కడ ఫ్రెషప్ అయిన తర్వాత… లంచ్ ఉంటుంది. అక్కడ్నుంచి తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్ కు వెళ్తారు. సాయంత్రం హోటల్ కు చేరుకుంటారు. డిన్నర్ తర్వాత విశాఖలోనే బస చేస్తారు.
  • డే 2: బ్రేక్ ఫాస్ట్ తర్వాత అరకు(ఉదయం 8 వరకు)కు చేరుకుంటారు. ఇక్కడ పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లానిటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి విశాఖకు చేరుకుంటారు.
  • డే 3: బ్రేక్ ఫాస్ట్ తర్వాత విశాఖలో సబ్ మెరైన్ మ్యూజియం చేస్తారు. ఈ మ్యూజియం సోమవారం తెరిచి ఉండదు.ఆ తర్వాత రామానాయుడు స్టూడియోను కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు:

టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 20035, డబుల్ అక్యుపెన్సీకి రూ. 10860,ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 8450గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలుంటే 8287932318, 9281495847, 9550166168 నెంబర్లను సంప్రదించవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks