IRCTC Araku tour Package : అరకు ట్రిప్ ప్లాన్ ఉందా..? జలపాతాలు, కొండ కోనలు, చల్లని వాతావరణం, కాఫీ తోటలతో మురిపించే అరకు లోయ అందాలను అస్వాదించేందుకు ఐఆర్సీటీసీ టూరిజం అద్భుతమైన వన్ డే రైల్ కమ్ రోడ్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

'విశాఖపట్నం - అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ' (Visakhapatnam - Araku Rail Cum Road Package) పేరుతో నడుస్తున్న ఈ టూర్ ప్యాకేజీని విశాఖ నుంచి ఆపరేట్ చేస్తారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేవలం ఒక్క రోజులోనే అరకు లోయలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూసి రావచ్చు. పర్యాటకులు తమకు నచ్చిన ఏ రోజైనా ఈ అద్భుత యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.
టూర్ షెడ్యూల్ ఇలా :
- ఉదయం 07:00 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి (రైలు నంబర్ 58501) ద్వారా అరకు ప్రయాణం మొదలవుతుంది. మార్గమధ్యంలో దట్టమైన కొండలు, సుదీర్ఘమైన వంతెనలు, కొండలను తొలిచి నిర్మించిన గుహలు (టన్నెల్స్), అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
- ఉదయం 11:00 గంటలకు రైలు అరకు స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో పర్యాటకులను పికప్ చేసుకుంటారు. అనంతరం స్థానికంగా ఉండే గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ట్రైబల్ మ్యూజియం (Tribal Museum), అందమైన పద్మాపురం బొటానికల్ గార్డెన్‌ను సందర్శిస్తారు.
- మధ్యాహ్నం రుచికరమైన భోజనం ముగించుకున్న తర్వాత, అరకు నుండి వైజాగ్ తిరుగు ప్రయాణం రోడ్డు మార్గంలో ప్రారంభమవుతుంది. మార్గమధ్యంలో సందర్శన: తిరుగు ప్రయాణంలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్ అందాలను చూడవచ్చు. ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బొర్రా గుహలను (Borra Caves) సందర్శిస్తారు.
- పర్యాటక ప్రాంతాల సందర్శన ముగిసిన తర్వాత రాత్రికి వైజాగ్ చేరుకుంటారు. పర్యాటకులను వారి వీలును బట్టి వైజాగ్ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ వద్ద డ్రాప్ చేయడంతో ఈ యాత్ర ముగుస్తుంది.
హోటళ్లలో లగేజీ మోసే పోర్టేజ్ ఛార్జీలు, టిప్స్, మినరల్ వాటర్, లాండ్రీ, టెలిఫోన్ ఛార్జీలు వంటి వ్యక్తిగత ఖర్చులు పర్యాటకులే భరించాలి. పర్యాటక ప్రాంతాల్లో కెమెరా లేదా వీడియో కెమెరా రుసుములు, ఇటినెరరీలో పేర్కొనని ఇతర ప్రవేశ రుసుములు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణంలో పేర్కొన్నవి కాకుండా అదనపు భోజనాలు లేదా ఇతర యాక్టివిటీలకు పర్యాటకులే నేరుగా చెల్లించాలి.
{{/usCountry}}హోటళ్లలో లగేజీ మోసే పోర్టేజ్ ఛార్జీలు, టిప్స్, మినరల్ వాటర్, లాండ్రీ, టెలిఫోన్ ఛార్జీలు వంటి వ్యక్తిగత ఖర్చులు పర్యాటకులే భరించాలి. పర్యాటక ప్రాంతాల్లో కెమెరా లేదా వీడియో కెమెరా రుసుములు, ఇటినెరరీలో పేర్కొనని ఇతర ప్రవేశ రుసుములు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణంలో పేర్కొన్నవి కాకుండా అదనపు భోజనాలు లేదా ఇతర యాక్టివిటీలకు పర్యాటకులే నేరుగా చెల్లించాలి.
{{/usCountry}}ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు లేదా బుకింగ్స్ కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్ 1 పక్కన, ఏపీటీడీసీ కౌంటర్ వద్ద ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు.
విశాఖ - అరకు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్(EV) లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6545, డబుల్ అక్యుపెన్సీకి రూ.4055,ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 3225గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.