పాఠశాల పిల్లల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘యువ విజ్ఞాని కార్యక్రమ్’ (యువికా)-2026ను ఇస్రో నిర్వహిస్తోంది. యువ విద్యార్థులకు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, వాటి అనువర్తనాలపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం.
ఎవరు అర్హులు….?
- జనవరి నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులవుతారు.
- మార్చి 31, 2026 తేదీతో గడువు ముగుస్తుంది.
- దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి మే నెలలో 2 వారాల పాటు శిక్షణ ఇస్తారు.
- ఇస్రో సెంటర్లలో ప్రాక్టికల్ సెషన్లు, ప్రాజెక్టులు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..?
- ముందుగా http://jigyasa.iirs.gov.in/youvika వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
- అప్లయ్ ఫర్ యువికా రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- విద్యార్థి పేరు, తండ్రి పేరు, పాఠశాల, రాష్ట్రం, ఈమెయిల్ వివరాలు నమోదు చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి కావటంతో లాగిన్ వివరాలు జనరేట్ అవుతాయి.
- లాగిన్ వివరాలతో విద్యార్థి విద్య, ఇతర వివరాలను ఎంట్రీ చేయాలి. సంబంధిత పత్రాలు కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇస్రో యువికా 2026 ఎంపిక విధానం :

ఇస్రో యువికా 2026 2026 కోసం విద్యార్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వివిధ అంశాల ఆధారంగా జరుగుతుంది. 8వ తరగతి మార్కులు, క్విజ్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 8వ తరగతి మార్కులకు 50 శాతం వెయిటేజీ ఉంటే.. ఆన్‌లైన్ క్విజ్ కు 10 శాతం వెయిటేజీ ఇస్తారు. సైన్స్ ప్రదర్శనలు/కార్యక్రమాలను కూడా పరిశీలిస్తారు. గత మూడేళ్లలో పాల్గొన్న స్థాయిని బట్టి 2 నుంచి 10 శాతం వెయిటేజీ ఇస్తారు.
ఒలింపియాడ్స్, క్రీడలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, NCC లేదా NSSలో సాధించిన విజయాలకు అదనపు మార్కులు ఉంటాయి. గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయా విద్యార్థులకు అదనంగా 15 శాతం వెయిటేజీ ఇస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీస ప్రాతినిధ్యం ఉండేలా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఈ ఇస్రో యువికా 2026 శిక్షణా కార్యక్రమం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ వంటి తొమ్మిది ప్రధాన ఇస్రో కేంద్రాల్లో జరుగుతుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంపికైన విద్యార్థుల కోర్సు మెటీరియల్, వసతి, భోజన ఖర్చులన్నింటినీ ఇస్రోయే చూసుకుంటుంది.
ఇందులో ఎంపికయ్యే విద్యార్థులు…. ఇస్రో సైంటిస్టులతో డైరెక్ట్ ఇంటారాక్షన్, ల్యాబ్ విజిట్లు, స్పేస్ టెక్ ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంటుంది. ఇది సైన్స్‌లో కెరీర్ ఆసక్తి ఉన్న విద్యార్థులకు మంచి అవకాశమని చెప్పొచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భావి శాస్త్రవేత్తలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
{{/usCountry}}ఇందులో ఎంపికయ్యే విద్యార్థులు…. ఇస్రో సైంటిస్టులతో డైరెక్ట్ ఇంటారాక్షన్, ల్యాబ్ విజిట్లు, స్పేస్ టెక్ ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంటుంది. ఇది సైన్స్‌లో కెరీర్ ఆసక్తి ఉన్న విద్యార్థులకు మంచి అవకాశమని చెప్పొచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భావి శాస్త్రవేత్తలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
{{/usCountry}}