రాజమహేంద్రవరంలో ఇటీవల చోటుచేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం విషాదాంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర క్రూరత్వంలో కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి, ప్రాణాలతో బయటపడిన 10 ఏళ్ల చిన్నారి రియాన్ష్ కార్తికేయరెడ్డి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్ చేసిన అకృత్యాల వల్ల తాను నిమిషాల వ్యవధిలో అనాథగా మిగిలిపోయానని ఆ బాలుడు కన్నీరుమున్నీరయ్యాడు.

భయాందోళనలో ఉన్న చిన్నారి రియాన్ష్‌ను కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలుడితో పాటు ఎంపీ మీడియాకు ఈ దారుణమైన పరిస్థితులను వివరించారు.
మీడియాతో బాలుడు రియాన్ష్ మాట్లాడుతూ 'నాకు 3వ తరగతి నుంచే రైఫిల్ షూటింగ్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో శిక్షణ తీసుకునే సమయంలో సాధిక్ ఖాన్ కోచ్‌గా వచ్చాడు. అక్కడే మా అమ్మతో అతనికి పరిచయం ఏర్పడింది. నాటి నుంచి మా అమ్మను చిత్రహింసలకు గురిచేసేవాడు. మా నాన్న జగదీష్ రెడ్డి తాగే ప్రొటీన్ షేక్‌లో రసాయనాలు కలిపి ఆయన్ను చంపేశాడు. ఈ అన్యాయాన్ని ఎవరికైనా చెబితే నన్ను టెర్రరిస్టులకు అమ్మేస్తానని భయపెట్టేవాడు. నా కుటుంబాన్ని నాశనం చేసి నన్ను ఒంటరిని చేశాడు. బయటకు వెళ్లాలంటేనే నాకు భయమేస్తోంది.' అని గుండెలు పిండేలా విషయాలను పంచుకున్నాడు రియాన్ష్.
నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు, చిన్నారి తండ్రి మరణానికి పూర్తి బాధ్యుడు సాధిక్ ఖానేనని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆయన వెల్లడించారు. జగదీష్ రెడ్డికి ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ ఇచ్చి హత్య చేశాడని, నూకరాజు ఆస్తిపత్రాలు, బ్యాంక్ ఖాతాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడని ఎంపీ ఆరోపించారు. అంతేకాకుండా, సౌజన్యపై హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు సూసైడ్ నోట్ ద్వారా తెలిసిందన్నారు.
నూకరాజు వీలునామాను మార్చి ఆ కుటుంబానికి చెందిన ఆస్తులన్నీ చట్టబద్ధంగా చిన్నారి రియాన్ష్ కార్తికేయరెడ్డి పేరు మీదకు బదిలీ అయ్యేలా చూడాలని కలెక్టర్‌ను కోరినట్లు ఎంపీ తెలిపారు. బాలుడి చదువుకు, రక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}నూకరాజు వీలునామాను మార్చి ఆ కుటుంబానికి చెందిన ఆస్తులన్నీ చట్టబద్ధంగా చిన్నారి రియాన్ష్ కార్తికేయరెడ్డి పేరు మీదకు బదిలీ అయ్యేలా చూడాలని కలెక్టర్‌ను కోరినట్లు ఎంపీ తెలిపారు. బాలుడి చదువుకు, రక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}ఈ కేసు అత్యంత ఘోరమైనది కాబట్టి దీనిని సీబీఐకి అప్పగించి లోతుగా విచారణ జరిపించాలని, నిందితుడు సాధిక్‌కు ఉరిశిక్ష విధించాలని ఎంపీ డిమాండ్ చేశారు. అలాగే సాధిక్ తరఫున ఏ న్యాయవాది వాదించవద్దని బార్ అసోసియేషన్‌ను కోరారు. సాధిక్ ఖాన్ వద్ద షూటింగ్ శిక్షణ పొంది వేధింపులకు గురైన ఇతర విద్యార్థులు ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని, వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎంపీ హామీ ఇచ్చారు.
నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఇప్పటికే నిందితుడు సాధిక్ ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనాథగా మారిన ఆ చిన్నారికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.