...
...
Next Story

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం - కోస్తాంధ్రకు మళ్లీ హెచ్చరికలు..! 3 రోజులపాటు తెలంగాణలోనూ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వేగంగా బలపడుతోంది. రాబోయే 48 గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారి కోస్తాంధ్ర తీరానికి చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోనూ ఈ నెల 19 నుంచి వర్షాలు కురవనున్నాయి.

Published on: Nov 16, 2026, 10:13:07 IST
Advertisement

తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ, దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ తీరం వైపు కదులుతోంది. గడిచిన 6 గంటల్లో ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి 720 కిలోమీటర్లు, విశాఖ పట్నానికి 820 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

అతి తీవ్ర తుపానుగా మారి కోస్తాంధ్ర వైపు..

వెదర్ రిపోర్ట్
వెదర్ రిపోర్ట్

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం….. ఈ తీవ్ర వాయుగుండం దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత మంగళవారం (నవంబర్ 17) నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనుంది. ఆ తదుపరి 48 గంటల్లో ఇది మరింత శక్తివంతమై 'అతి తీవ్ర తుఫాను'గా మారి కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయి.

తెలంగాణలో నవంబర్ 19 నుంచి వర్షాలు…

బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడనుంది. నవంబర్ 18వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగుతుంది. రాబోయే రెండు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. అయితే…. నవంబర్ 19వ తేదీ ఉదయం నుంచి రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది.

ఇవాళ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయపు వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఏర్పడుతుంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. గత 24 గంటల్లో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31.4 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 16.4 డిగ్రీలుగా నమోదైంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks