తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ అన్నదానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజూ వేల మంది కడుపు నింపుకొంటారు. మరోవైపు లడ్డూలు కూడా వేల సంఖ్యలో అమ్ముడవుతాయి. వీటన్నింటికీ ఎల్పీజీ అవసరం. అయితే ఇప్పుడు దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం తిరుమలపై కూడా పడిందా? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.

తిరుమలలో లడ్డూ, అన్నదానం వంటశాలలకు వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని టీటీడీ తెలిపింది. తిరుమలలో ప్రతిరోజూ సగటున నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తారని, పండుగ సమయాల్లో ఈ సంఖ్య దాదాపు 10 లక్షలకు పెరుగుతుందని ఆలయ అధికారి ఒకరు తెలిపారు.
తిరుమలలో లడ్డూ తయారీకి, అన్నదానం యూనిట్లకు కలిపి మొత్తం వంట గ్యాస్ అవసరం రోజుకు 10 టన్నులకు పైగా ఉందని ఓ అధికారి వెల్లడించారు. తిరుమలలో వంట గ్యాస్ సరఫరాకు కొరత లేదా అంతరాయం లేదు. భక్తులు ఎలాంటి పరిమితులు లేకుండా యథావిధిగా లడ్డూలను తీసుకోవచ్చు అని అధికారి పీటీఐకి తెలిపారు. లడ్డూలు, స్వీట్లు, అన్నప్రసాదాలను నిరంతరాయంగా తయారు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వారానికి సరిపడా వంట గ్యాస్ బఫర్ స్టాక్‌ను నిర్వహిస్తుందని అధికారి పేర్కొన్నారు.
లడ్డూ పంపిణీలో ప్రాధాన్యత మొదట తిరుమలకు ఇస్తాు. తరువాత టీటీడీ సమాచార కేంద్రాలు, ముఖ్యమైన దేవాలయాలకు సరఫరా చేస్తారు. అదేవిధంగా టీటీడీ లడ్డూ తయారీకి, ప్రధాన అన్నదానం కేంద్రానికి పైపుల ద్వారా గ్యాస్ సరఫరాను ఉపయోగిస్తుంది. అయితే ఇతర అన్నదానం యూనిట్లకు సిలిండర్లను ఉపయోగిస్తారు.
ప్రధాన అన్నదానం కేంద్రంలో సగటున దాదాపు 75,000 భోజనాలు తయారు చేస్తుండగా.. అన్ని కేంద్రాలలో దాదాపు 2.25 లక్షల భోజనాలు వడ్డిస్తారు. పండుగ రోజుల్లో అన్నదాన కేంద్రాలలో తయారుచేసే భోజనాల సంఖ్య మూడు లక్షలకు పైగా పెరుగుతుందని అధికారి తెలిపారు. సో.. టీటీడీలో ప్రస్తుతానికి ఎలాంటి గ్యాస్ సంక్షోభం లేదు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ స్పష్టం చేసింది.
{{/usCountry}}ప్రధాన అన్నదానం కేంద్రంలో సగటున దాదాపు 75,000 భోజనాలు తయారు చేస్తుండగా.. అన్ని కేంద్రాలలో దాదాపు 2.25 లక్షల భోజనాలు వడ్డిస్తారు. పండుగ రోజుల్లో అన్నదాన కేంద్రాలలో తయారుచేసే భోజనాల సంఖ్య మూడు లక్షలకు పైగా పెరుగుతుందని అధికారి తెలిపారు. సో.. టీటీడీలో ప్రస్తుతానికి ఎలాంటి గ్యాస్ సంక్షోభం లేదు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ స్పష్టం చేసింది.
{{/usCountry}}