ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. గత ఐదేళ్లుగా మూడు రాజధానుల చుట్టూ తిరిగిన ఏపీ రాజకీయం….. ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అంగీకరించే ప్రసక్తే లేదని వైసీపీ గట్టిగా చెబుతోంది. తాజాగా కూడా ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత జగన్ కూడా ప్రస్తావించారు.రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సరికొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తుందని కూడా ప్రకటించారు.

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 'మావిగన్' (Mavigun - Machilipatnam-Vijayawada-Guntur) కారిడార్‌ను కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పుకొస్తున్నారు. ఇదే తమ ఎన్నికల నినాదమని స్పష్టం చేస్తున్నారు.
అమరావతి వర్సెస్ మావిగన్…!
ఇటీవలే మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్…. వచ్చే ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్యే కాదు, రెండు భిన్నమైన రాజధాని ఆలోచనల మధ్య జరుగుతాయని పేర్కొన్నారు. "రాబోయే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అనే అంశంపైనే సాగుతాయి. మావిగన్ ప్రాంతాన్ని రాజధానిగా కోరుకునే వారు వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారు, అమరావతిని మాత్రమే కోరుకునే వారు టీడీపీ వైపు నిలుస్తారు. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మనమే చూద్దాం" అని జగన్ సవాల్ విసిరారు.
ఇటీవల వైఎస్సార్సీపీ బృందం అమరావతి ప్రాంతంలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమ పర్యటనను రాజధానికి వ్యతిరేకంగా చిత్రీకరించేందుకు కుట్రలు జరిగాయని జగన్ మండిపడ్డారు. అమరావతి పేరుతో సాగుతున్న భారీ అవినీతిని, అక్రమాలను బట్టబయలు చేయడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
జగన్ వ్యాఖ్యలే కాదు… వైసీపీ నేతలు కూడా మావిగన్ అంశాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ నినాదం ఇదే ఉంటుందని చెబుతున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని గట్టిగా చెబుతున్నారు.
వైసీపీ మావిగన్ ప్రతిపాదనను కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ రాజధానిపై మళ్లీ కొత్త వివాదానికి తెరలేపుతున్నారని విమర్శిస్తున్నారు. అమరావతి అనేది కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడింది కాదని…. అది ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి, భవిష్యత్తు ఆకాంక్షలకు ప్రతీక చెప్పుకొస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా… జగన్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు.
{{/usCountry}}వైసీపీ మావిగన్ ప్రతిపాదనను కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ రాజధానిపై మళ్లీ కొత్త వివాదానికి తెరలేపుతున్నారని విమర్శిస్తున్నారు. అమరావతి అనేది కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడింది కాదని…. అది ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి, భవిష్యత్తు ఆకాంక్షలకు ప్రతీక చెప్పుకొస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా… జగన్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు.
{{/usCountry}}గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు ప్రకటించిన జగన్…. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల డ్రామా ఆడారని, ఇప్పుడు విపక్షంలోకి రాగానే 'మావిగన్' అంటూ కొత్త రాగాన్ని అందుకుంటున్నారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇంటి పునాదులు మార్చినట్లుగా, రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా చూస్తే ఎన్నికలకు చాలా సమయం ఉండగానే…. వైసీపీ ఎన్నికల మూడ్ లోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా రాజధాని విషయంలో ఓ క్లారిటీతో ఉండాలని భావిస్తున్న ఆ పార్టీ…. మావిగన్ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ప్రజామోదంతో అధికారంలోకి రావాలని చూస్తోంది. మరోవైపు అమరావతిలో పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా ఓవైపు అమరావతి…. మరోవైపు మావిగన్ నినాదాలే వచ్చే ఎన్నికల్లో కీలకంగా ఉంటుందనే చర్చ ఇప్పట్నుంచే మొదలైంది…!