AP Temperatures : ఏపీలో నిప్పుల కొలిమి - పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత..!
AP Temperatures : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయి ఎండలు మండిపోతున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్టంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం వరకు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
AP Temperatures : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. ఊళ్లు, వాడలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం(మే 21) నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఊహించని స్థాయికి చేరింది. ముఖ్యంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై ప్రజలను నరకప్రాయం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం జిల్లాల వారీగా నిప్పులు కురిసిన ప్రాంతాలు ఇలా ఉన్నాయి:
- పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
- బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడ ప్రాంతాల్లో 47.6 డిగ్రీల వేడి రికార్డయింది.
- ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకి పరిసరాల్లో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
- ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలుగా తీవ్రత ఉంది.
- మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
- అల్లూరి సీతారామరాజు (పోలవరం) జిల్లా కూనవరంలో 46.5 డిగ్రీల వేడి నమోదైంది.
- నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీలు, గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాబోయే నాలుగు రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "రాష్ట్రంలో వచ్చే సోమవారం వరకు ఎండ తీవ్రత మరియు వడగాల్పులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి," అని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

