...
...
Next Story

మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ యూనిట్‌ ప్రారంభం.. ఎలా పనిచేస్తుందంటే?

mee intiki mee doctor : తిరుపతిలో ‘మీ ఇంటికి మీ డాక్టర్’ కార్యక్రమం కింద ఒక మొబైల్ యూనిట్ ప్రారంభమైంది. ఇది గ్రామాల్లోకి వెళ్లి జనాలకు సేవలు అందిస్తుంది.

Published on: Mar 26, 2026, 19:01:19 IST
Advertisement

వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు వారి ఇంటి వద్దకే ఉచిత వైద్య సంరక్షణను అందించేందుకు, తిరుపతి జిల్లా యంత్రాంగం మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమం కింద ఒక మొబైల్ యూనిట్ ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి ఛైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్‌లతో కలిసి ఈ యూనిట్‌ను ప్రారంభించారు.

మీ ఇంటికి మీ డాక్టర్
మీ ఇంటికి మీ డాక్టర్

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ అందుబాటును మెరుగుపరిచేందుకు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ యూనిట్ ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాలను కవర్ చేస్తుంది. ప్రతిరోజూ సుమారు 100 మంది రోగులకు ఔట్ పేషెంట్ సంరక్షణ, మందులను అందిస్తుందని అధికారులు చెబుతున్నారు.

మొబైల్ యూనిట్‌లో ఒక డాక్టర్, ఒక నర్సు, ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక డ్రైవర్ ఉంటారు. వీరు ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజూ రెండు నుండి మూడు గ్రామాలను సందర్శిస్తారు. రోగుల తదుపరి పర్యవేక్షణ కోసం ఈ మెుబైల్ యూనిట్ టీమ్ ఆశా(ASHA), ఏఎన్ఎం (ANM) కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటుంది. తదుపరి చికిత్స అవసరమైన వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులకు పంపిస్తారు.

తిరుపతితో సహా ఏడు జిల్లాల్లో రూ.8.40 కోట్ల వ్యయంతో ఇలాంటి మొబైల్ యూనిట్లను ప్రవేశపెట్టినట్లు డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమం టీకా కవరేజీని మెరుగుపరచడం, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను తగ్గించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. తిరుపతి రెడ్ క్రాస్‌లో ప్లేట్‌లెట్లు, ప్లాస్మాను వేరుచేసే సౌకర్యాలతో ఒక బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. కళాశాలలు, సంస్థలలో రక్తదానాలను ప్రోత్సహించడానికి మొబైల్ బ్లడ్ బ్యాంక్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe