Andhrapradesh : రాష్ట్రంలో మళ్లీ కిరోసిన్ సరఫరా...! త్వరలోనే పంపిణీ, ముందుగా ఇక్కడే

 గ్యాస్ కోసం ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.గృహ అవసరాల గ్యాస్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే కిరోసిన్ సరఫరా చేస్తామని ప్రకటించారు.

Published on: Mar 21, 2026, 10:15:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ఎక్కడా గృహ అవసరాలకు సంబంధించిన వంట గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. ప్రజల్లో అపోహలు, భయాందోళనలు కలిగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు సూచించారు.

త్వరలోనే కిరోసిన్ సరఫరా (iamge source X)
త్వరలోనే కిరోసిన్ సరఫరా (iamge source X)

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను మూడు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్పీసీఎల్ (IOCL, BPCL, HPCL) వంటి ప్రధాన ఆయిల్ కంపెనీలు సప్లై చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రజలు ఆందోళనకు గురై ఎక్కువ బుకింగ్స్ జరుపుతున్నారని మంత్రి నాదెండ్ల తెలిపారు.

గ్యాస్ కొరతా లేదు….

గత వారం రోజుల్లో ఇలాంటి అపోహల వల్లనే అధికంగా బుకింగ్స్ జరిగాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని… ముఖ్యంగా గృహ అవసరాలకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా గ్యాస్ సరఫరా చేస్తున్నామన్నారు. వాణిజ్య అవసరాలకు కూడా ప్రస్తుతానికి పెద్ద ఇబ్బందులేవీ లేవన్నారు. ఆస్పత్రులు, పాఠశాలలు, వసతి గృహాలు, అత్యవసర సర్వీసులకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ వాణిజ్య అవసరాల గ్యాస్ ను సరఫరా చేస్తున్నామన్నారు. క్రమంగా గ్యాస్ సరఫరా మరింత మెరుగయ్యేలా ప్రణాళికాబద్ధంగా సమష్టిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

యుద్దం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్యాస్ పరిస్థితులను చూస్తూ రాష్ట్రంలో గ్యాస్ ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు జరపడమేకాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతుందన్నారు. ఈ నెల 9న ఎసెన్షియల్ కమర్షియల్ యాక్ట్ ను కేంద్రం ప్రకటించిన దగ్గర నుంచి…. రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతుందన్నారు.

ఓటీపీ ద్వారానే బుకింగ్స్ - మంత్రి నాదెండ్ల

పౌర సరఫరాలు శాఖ ఆధ్వర్యంలో అన్ని వివరాలు తెప్పించుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో గతంలో రోజుకు 1 లక్ష 80 వేల వరకు… రద్దీ సమయాల్లో ఎక్కువగా దాదాపు 1,96,000 వరకు గ్యాస్ బుకింగ్స్ జరిగాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల నుంచి పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కి మారేలా కొత్త పాలసీని సోమవారం సాయంత్రానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. హోటల్స్ తో, రెస్టారెంట్ ప్రతినిధులతో త్వరలో సమావేశం పెడుతున్నామన్నారు. ముందుగా పాఠశాలల్లోని హాస్టల్స్, హాస్పిటల్స్ లో గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. ఆ తరువాత తదితర రంగాలకు వాటి ప్రాధాన్యత ఆధారంగా ఇవ్వబోతున్నామని వివరించారు. ఆన్లైన్ ద్వారానే బుకింగ్స్ చేసుకోవాలి అని…. ఓటీపీ ద్వారా 100 శాతం గ్యాస్ అందేలా చేస్తున్నామన్నారు. ఓటీపీ వస్తేనే బుక్ అయినట్లు గా నిర్దారణ చెందుతుందన్నారు.

బ్లాక్ మార్కెట్ పై మీడియా లో వచ్చిన కథనాల ప్రకారం ఉక్కుపాదం మోపుతామన్నారు. “గ్యాస్ ఏజెన్సీలన్నింటికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి ఒక్కరి లిస్ట్స్ మా దగ్గర ఉన్నాయి. ఎక్కడైనా గ్యాస్ పక్కదారి పడితే చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే అలాంటి చర్యలకు పాల్పడిన 6 నుంచి 9 ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్నాం” అని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.

త్వరలోనే కిరోసిన్ సరఫరా - మంత్రి నాదెండ్ల

కేంద్రం కిరోసిన్ కూడా అందించమని ప్రకటించిందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. త్వరలోనే కిరోసిన్ సరఫరా చేస్తామన్నామన్నారు. ఏపీని గతంలోనే కిరోసిన్ రహితం గా చేశామని… కానీ పరిస్థితుల దృష్ట్యా వాడకం మళ్లీ మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముందుగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వబోతున్నామన్నారు. జిల్లా స్థాయిలోనూ జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని గ్యాస్ సరఫరా వాస్తవ పరిస్థితిని అందిస్తున్నారని వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More