MBU Scholarships : మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి శుభవార్త - 100 శాతం వరకు ఫీజు మినహాయింపు! స్కాలర్‌షిప్ వివరాలివే

Mohan Babu University Scholarships : తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ప్రతిభావంతులైన, పేద విద్యార్థులకు 100 శాతం వరకు ఫీజు మినహాయింపు ఇచ్చే స్కాలర్‌షిప్ విధానాన్ని ప్రకటించింది. క్రీడాకారులు, ఏకైక ఆడపిల్లలకు ఈ అవకాశం లభిస్తుంది.

Published on: Aug 22, 2026, 13:12:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mohan Babu University Scholarships : ఉన్నత విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తిరుపతిలోని ప్రముఖ విద్యా సంస్థ మోహన్ బాబు యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ విధానాన్ని ప్రకటించింది. ప్రతిభ, ఆర్థిక వెనుకబాటుతనం, సామాజిక నేపథ్యాలు, ప్రత్యేక ప్రతిభ ఆధారంగా అర్హులైన విద్యార్థులకు బోధనా రుసుము (ట్యూషన్ ఫీజు)లో ఏకంగా 100 శాతం వరకు మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

మోహన్ బాబు యూనివర్సిటీ
మోహన్ బాబు యూనివర్సిటీ

అర్హులు ఎవరంటే..?

ఈ సమగ్ర స్కాలర్‌షిప్ విధానం కింద కుటుంబంలో ఒక్కరే ఆడపిల్ల అయిన విద్యార్థినులు, భారత సాయుధ దళాల సిబ్బంది, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, వర్సిటీకి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పాత విద్యార్థులు (అలుమ్ని), రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలితరం గ్రాడ్యుయేట్లకు (కుటుంబంలో మొదటిసారి డిగ్రీ చదువుతున్న వారు) ప్రత్యేక లబ్ధి చేకూరనుంది. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు వారి చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.

క్రీడాకారులకు బాసటగా…

క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆటగాళ్ల కోసం ఎంబీయూ ప్రత్యేక ప్రతిభా ఆధారిత స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా లేదా సౌత్ ఆసియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు పూర్తి స్థాయిలో అంటే 100 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. అలాగే జాతీయ స్థాయి విన్నర్లకు 50 శాతం, రాష్ట్ర స్థాయి క్రీడా విజేతలకు 25 శాతం ఫీజు మినహాయింపు ఇస్తారు.

ఇంజినీరింగ్ చేరాలనుకునే విద్యార్థులకు కూడా అద్భుతమైన అవకాశం ఉంది. జేఈఈ మెయిన్స్ (JEE Main) రాసిన అభ్యర్థులు తమ స్కోరు ఆధారంగా 100 శాతం వరకు ఫీజు మినహాయింపు పొందవచ్చు. 95 నుంచి 97.99 పెర్సంటైల్ సాధించిన వారికి 75 శాతం స్కాలర్‌షిప్ ఇస్తారు. ఎంబీయూసెట్ (MBUCET), ఏపీ ఈఏపీసెట్ (APEAPCET) రాసిన వారు కూడా తమ ర్యాంకులు, అర్హత పరీక్షల మార్కుల ఆధారంగా ఈ లబ్ధి పొందవచ్చు.

ఇతర నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు అర్హత పరీక్షలో (ఇంటర్ మొదలైనవి) 95 శాతానికి పైగా మార్కులు వస్తే 35 శాతం, 90 నుంచి 95 శాతం మార్కులకు 25 శాతం, 85 నుంచి 89.99 శాతం మార్కులు సాధించిన వారికి 10 శాతం ఫీజు మినహాయింపు ఇస్తారు.

నూతనంగా చేరిన బీటెక్ విద్యార్థుల కోసం మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రవేశ కార్యక్రమాన్ని (ఇండక్షన్ ప్రోగ్రామ్) ఇప్పటికే ప్రారంభించింది. మొదటి విడత ఇండక్షన్ ప్రోగ్రామ్‌లోనే 1,200 మందికి పైగా కొత్త విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యాంపస్ వాతావరణం, విద్యా అవకాశాలు, ల్యాబ్‌లు మరియు యూనివర్సిటీ జీవన విధానాన్ని విద్యార్థులకు పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది.

ఈ సందర్భంగా మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ వినయ్ మహేశ్వరి మాట్లాడుతూ.. "నాణ్యమైన ఉన్నత విద్య అనేది విద్యార్థి యొక్క ప్రతిభ, పట్టుదల ఆధారంగా మాత్రమే లభించాలి కానీ, వారి ఆర్థిక పరిస్థితులపై ఆధారపడకూడదని ఎంబీయూ నమ్ముతోంది. ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి డబ్బు లేని కారణంగా ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఈ విస్తృత స్కాలర్‌షిప్ పాలసీని రూపొందించాం. సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక శక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే మా బాధ్యత" అని తెలిపారు.

మోహన్ బాబు విశ్వవిద్యాలయం గురించి..

1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (SVET) పేరుతో ప్రారంభమై, సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ విద్యాసంస్థ తిరుపతిలోని 40 ఎకరాల విస్తృత క్యాంపస్‌లో కొనసాగుతోంది. ప్రసిద్ధ నటుడు, డాక్టర్ మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సారథ్యంలో ఈ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, పారామెడికల్, మీడియా స్టడీస్, ఎంబీయూ ఫిల్మ్ అకాడమీ సహా 108 కంటే ఎక్కువ కోర్సులను అందిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More