...
...
Next Story

జులైలో వర్షాలు ఊపందుకుంటాయి.. ఖరీఫ్ పంటల సాగుకు ఊతం

జులైలో వర్షాలు ఊపందుకుంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు.

Published on: Jul 8, 2026, 18:40:19 IST
Advertisement

జులైలో రుతుపవన వర్షాలు బలపడతాయని, ఇది ఖరీఫ్ పంటల సాగుకు సహాయపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. జున్‌లో 33 శాతంగా ఉన్న మొత్తం వర్షపాత లోటు జులైలో 24 శాతానికి తగ్గిందని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం చౌహాన్ విలేకరులతో అన్నారు. ఇటీవలి రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో, వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని వెల్లడించారు.

జులై వర్షాలు
జులై వర్షాలు

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాతో సహా 13 రాష్ట్రాల్లోని పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని చౌహాన్ తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2026 సీజన్‌లో ఖరీఫ్ పంటల సాగు మొత్తం విస్తీర్ణం గత ఏడాది 41.28 మిలియన్ హెక్టార్లతో పోలిస్తే 21 శాతం తగ్గి ఇప్పటివరకు 35.085 మిలియన్ హెక్టార్లకు చేరింది.

రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ముఖ్యంగా సోయాబీన్, పత్తి పంటల సాగు దెబ్బతిందని చౌహాన్ అన్నారు. ఈ ప్రభావాన్ని పరిమితం చేయడానికి మొక్కజొన్న, సజ్జలు, పెసర వంటి తక్కువ కాలవ్యవధి గల, తక్కువ నీటి వినియోగం ఉండే పంటలకు మారాలని రైతులకు సలహా ఇచ్చింది ప్రభుత్వం. ఎల్ నినో ప్రభావం పడే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వం ఏప్రిల్ నుంచే సన్నాహాలు చేస్తోందని చౌహాన్ తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధన మండలితో కలిసి పనిచేస్తూ, ప్రభావితమయ్యే అవకాశం ఉన్న జిల్లాల కోసం అధికారులు ఆకస్మిక ప్రణాళికలను రూపొందించి, వాటిని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకున్నారని అన్నారు.

ప్రతికూల వాతావరణం వల్ల కలిగే నష్టాల నుండి ఆర్థిక రక్షణ కల్పించే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకంలో రైతుల నమోదును పెంచేందుకు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి చెప్పారు. ఎల్ నినో పర్యవేక్షణ సెల్, పంట వాతావరణ పర్యవేక్షణ బృందం, రాష్ట్ర స్థాయి నియంత్రణ గదులు, నియమిత అధికారులు రుతుపవనాల పురోగతి, పంట విత్తనాలు, పంట పరిస్థితులు, మార్కెట్ పోకడలను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. రుతుపవనాలకు సంబంధించిన ఏవైనా సవాళ్ల ప్రభావాన్ని తగ్గించడానికి 'మొత్తం వ్యవస్థను ముందుగానే క్రియాశీలం చేసి, చురుకుగా పనిచేసేలా చేశాం.' అని చౌహాన్ అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks