AP MPTC ZPTC Elections 2026 : రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నేటి నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు నేటి(ఉదయం 11 గంటల) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రకటించింది.
ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు:
- నామినేషన్ల స్వీకరణ : అక్టోబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 23వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
- నామినేషన్ల పరిశీలన : అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అక్టోబర్ 24వ తేదీన అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
- నామినేషన్ల ఉపసంహరణ : పోటీ నుంచి తప్పుకోవాలని భావించే అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి సమయం కేటాయించారు.
- పోలింగ్ తేదీ: నవంబర్ 3వ తేదీన ఉదయం నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.
- రీపోలింగ్ (అవసరమైతే ): ఏవైనా స్థానాల్లో సమస్యలు తలెత్తి రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 4వ తేదీన చేపడతారు.
- ఓట్ల లెక్కింపు - ఫలితాలు : నవంబర్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు తుది ఫలితాలను ప్రకటించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 జిల్లా పరిషత్‌ల పరిధిలోని స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 659 జెడ్పీటీసీ స్థానాలు, 659 ఎంపీపీ స్థానాలు, మరియు 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల సమరంలో మొత్తం 2,81,34,518 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
అమరావతిలోని నాలుగు మండలాలను మినహాయించి, రాష్ట్రంలోని మిగిలిన 659 మండలాల్లో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది.
పారదర్శకత, గట్టి భద్రతా ఏర్పాట్లు
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని స్థానిక పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను చేపడుతున్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో, ఈ ప్రాదేశిక ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక లేదా అసమ్మతి సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి.
మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీల నాయకులు బుజ్జగింపుల పర్వాన్ని వేగవంతం చేశారు. రెబల్స్ చేత నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
{{/usCountry}}మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీల నాయకులు బుజ్జగింపుల పర్వాన్ని వేగవంతం చేశారు. రెబల్స్ చేత నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
{{/usCountry}}