...
...
Next Story

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్.. క్షేత్రస్థాయి నేతలకు పదవులు.. కమిటీల వివరాలు ఇవే!

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ కోసం కష్టపడేవారికి పెద్దపీట వేస్తూ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను అధిష్టానం ప్రకటించింది.

Published on: Apr 15, 2026, 14:08:15 IST
Advertisement

పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకుని పదవులు ఇచ్చినట్టుగా అధిష్టానం వెల్లడించింది. పనిచేసేవారికే పార్టీలో పెద్దపీట అన్న సంకేతాన్ని ఇచ్చింది. మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పచెప్పారు.

నారా లోకేష్
నారా లోకేష్

మంత్రి నారా లోకేష్‌ను టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. తనదైన వ్యూహాలతో క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్న లోకేష్‌కు ఈ బాధ్యత అప్పగించడం ద్వారా పార్టీ భవిష్యత్తు బాగుంటుందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు మరోసారి నియమితులయ్యారు. సీనియర్లకు గౌరవం, కొత్తవారికి అవకాశాలు, సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగినట్టు తెలుస్తోంది.

29 మందితో పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ అయిన పొలిట్ బ్యూరో నియామకాలు జరిగాయి. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్‌లకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • 31 మందితో కూడిన జాతీయ కమిటీలో ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు కాగా 18 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 10 మందిని జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించింది టీడీపీ.
  • రాష్ట్ర కమిటీలో 185 మంది ఉండగా వీరిలో 7గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, 16 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, 14 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు, 10 మంది రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లు, 59 మంది రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు, 77 మంది రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరిని నియమించారు.
  • టీడీపీ రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ 50 మంది మహిళలకు చోటు కల్పించింది. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించింది.
  • 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది (బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13) బడుగులకు చంద్రబాబు చోటు కల్పించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks