KTR Comments : పార్టీ పేరు మార్పుతో నష్టపోయాం… 2027లో పాదయాత్ర చేస్తా - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ప్రజాసమస్యలపై 2027లో పాదయాత్ర మొదలుపెడతానని కేటీఆర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తులు ఉండదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత నష్టపోయామని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత నష్టపోయామన్నారు. 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. తాము కూడా కొన్ని తప్పులు చేశామని…. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలోని కార్యకర్తలను, సర్పంచులను, ఎంపీటీసీ, మండల అధ్యక్షులను కలుపుకొని పోవడంలో విఫలమయ్యామని చెప్పుకొచ్చారు.

మంచిర్యాల జిల్లా క్యాతన పల్లిలో మంచిర్యాల జిల్లాలో బీఆర్‌ఎస్ కారకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి 'దాచుకో-దోచుకో' అన్న పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా నడిపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అవినీతి దుకాణం తెరిచి అడ్డగోలుగా వసూళ్లకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి పథకంలో స్వయంగా మంత్రుల నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన 'దాచుకో-దోచుకో-దాచుకో' పథకం సింగరేణిలోనూ నడుస్తోందన్నారు.
కేటీఆర్ కామెంట్స్ :
- "రేవంత్ రెడ్డి అంత దారుణంగా, భారీ ఎత్తున దోచుకుంటున్న ముఖ్యమంత్రి కూడా దేశంలో ఇంకా ఎవరూ లేరు.
- తెలంగాణ రైతుల ముఖంలో చిరునవ్వులు రావాలి అంటే… సింగరేణి కార్మికులకు లాభం జరగాలి అంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందే.
- తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందే.
- కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కూడా వంత పాడుతూ సింగరేణి కుంభకోణాన్ని అడ్డుకోవడం లేదు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం కనీసం ఉలుకూ పలుకూ లేకుండా మౌనంగా ఉంది.
- వేల కోట్ల దోపిడీ పైన సీబీఐ ఎంక్వైరీ వేయమంటే పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్, బీజేపీ చీకటి దోస్తులుగా మారి ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి బావమరిది సింగరేణిలో టెండర్లు వేస్తుంటే ఇక్కడే వసూళ్లు అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
- ప్రధానమంత్రి ఢిల్లీకెంచి వచ్చి రాష్ట్రంలో 'ఆర్‌ఆర్' (RR) ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్ల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర దోపిడీ చేస్తున్నారు అని విమర్శించారు. కానీ రాహుల్-రేవంత్ ట్యాక్స్ పైన ఇప్పటిదాకా విచారణకు ప్రధానమంత్రి ఎందుకు ఆదేశించలేదు?
- 100 రోజుల్లో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదు.
- రైతుల నుంచి ఆడబిడ్డల దాకా, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అందరికీ తీవ్రమైన మోసానికి కాంగ్రెస్ పార్టీ గురి చేసింది.
- 'మూడు నెలల్లో పిల్లలు పుడతారా' అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, 30 నెలలు అయింది ఎందుకు గ్యారెంటీలు అమలు చేయలేదో అని మనం అడగాలి.
- సింగరేణి కార్మికుల కోసం ప్రతి బొగ్గు గనిలో మళ్ళీ అగ్గి పుట్టిస్తాం. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టం. సింగరేణికి అనేక సమస్యలు ఉన్నాయి.
- సింగరేణి బెల్టులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నిలదీయండి, గట్టిగా అడగండి.
- తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి బొగ్గుగని పైన, ప్రతి డివిజన్లో సమస్యలపైన మాట్లాడతాం. కార్మికులకు అండగా నిలబడతాం.
- కాళేశ్వరం కూలేశ్వరం అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….. కాళేశ్వరం ప్రాజెక్టు లేనిదే ఇంత భారీగా ధాన్యం ఎలా పండిందో చెప్పాలి" అని కేటీఆర్ ప్రశ్నించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

