NEET UG 2026 Admit Card : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ [NEET (UG)] - 2026 రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చేసింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను (హాల్ టికెట్లను) అధికారికంగా విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక పోర్టల్ ద్వారా తమ అడ్మిట్ కార్డ్‌లను తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.

ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం…. నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ జూన్ 21, 2026 (ఆదివారం) నాడు దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ పరీక్ష ఒకే షిఫ్ట్‌లో మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:15 గంటల వరకునిర్వహించబడుతుంది. విద్యార్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల పూర్తి సమాచారాన్ని వారి అడ్మిట్ కార్డ్‌లలోనే స్పష్టంగా పొందుపరిచారు.
అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా…?
అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాల్సి ఉంటుంది.
- మొదట నీట్ అఫీషియల్ వెబ్‌సైట్ https://neet.nta.nic.in ను సందర్శించాలి.
- జూన్ 14, 2026 నుండి అడ్మిట్ కార్డ్ లింక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడింది.
- అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ ప్రత్యక్షమవుతుంది, దానిని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
అభ్యర్థులకు కీలక సూచనలు…
విద్యార్థులు అడ్మిట్ కార్డ్‌తో పాటు ఎన్‌టీఏ విడుదల చేసిన సమాచార బులెటిన్ లోని నిబంధనలను, హాల్ టికెట్‌పై ఉన్న కీలక సూచనలను జాగ్రత్తగా చదువుకోవాలని అధికారులు సూచించారు. ఒకవేళ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేదా సాంకేతిక సమస్యలు ఎదురైనా నేరుగా ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
- హెల్ప్‌లైన్ నంబర్లు: 011-40759000 లేదా 011-69227700
- అధికారిక ఈ-మెయిల్: neetug2026@nta.ac.in
- అధికారిక వెబ్ సైట్ - https://www.nta.ac.in , https://neet.nta.nic.in
దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అత్యంత కీలకమైన నీట్ పరీక్ష మే 3న జరిగిన సంగతి తెలిసిందే. అయితే, క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన ప్రొఫెసర్ల స్థాయిలోనే పేపర్ లీక్ అయినట్లు దర్యాప్తులో తేలింది. పరీక్ష జరగడానికి రెండు రోజుల ముందే…. అంటే మే 1 నాడే కొంతమంది అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు ప్రశ్నపత్రాలు చేరినట్లు ఆధారాలు లభించడంతో ఆ పరీక్షను రద్దు చేసి, ఇప్పుడు జూన్ 21న అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.
{{/usCountry}}దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అత్యంత కీలకమైన నీట్ పరీక్ష మే 3న జరిగిన సంగతి తెలిసిందే. అయితే, క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన ప్రొఫెసర్ల స్థాయిలోనే పేపర్ లీక్ అయినట్లు దర్యాప్తులో తేలింది. పరీక్ష జరగడానికి రెండు రోజుల ముందే…. అంటే మే 1 నాడే కొంతమంది అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు ప్రశ్నపత్రాలు చేరినట్లు ఆధారాలు లభించడంతో ఆ పరీక్షను రద్దు చేసి, ఇప్పుడు జూన్ 21న అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.
{{/usCountry}}