ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ తీర రైల్వే) తీపి కబురు అందించింది. పండుగ వాతావరణం నెలకొన్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం - పార్వతీపురం మార్గంలో కొత్త స్పెషల్ మెము (MEMU) రైలును అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
ఈనెల 10 నుంచి రాకపోకలు - టైమింగ్స్ వివరాలు…

ఈ రోజువారీ ప్రత్యేక సర్వీసు 2026 అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు వేళలు మరియు స్టాప్‌ల వివరాలను రైల్వే శాఖ అధికారికంగా విడుదల చేసింది.
- విశాఖపట్నం – పార్వతీపురం స్పెషల్ మెము (రైలు నంబరు - 07268) : ఈ ప్రత్యేక రైలు ప్రతిరోజు ఉదయం 10:00 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మార్గమధ్యలో సింహాచలం (10.21/10.22), కొత్తవలస (10.35/10.36), విజయనగరం (11.04/11.06), గజపతినగరం (11.28/11.29), కోమటిపల్లి (11.37/11.38), దొంకినవలస (11.47/11.48), బొబ్బిలి (11.59/12.01), సీతానగరం (12.11/12.12), నరసింహపురం హాల్ట్ (12.18/12.19) స్టేషన్లలో ఆగుతూ మధ్యాహ్నం 12:35 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
- పార్వతీపురం – విశాఖపట్నం స్పెషల్ మెము (రైలు నంబరు - 07267) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతిరోజు మధ్యాహ్నం 12:35 గంటలకు పార్వతీపురంలో బయలుదేరుతుంది. నరసింహపురం హాల్ట్ (12.39/12.40), సీతానగరం (12.45/12.46), బొబ్బిలి (12.57/12.59), దొంకినవలస (13.10/13.11), కోమటిపల్లి (13.20/13.21), గజపతినగరం (13.29/13.30), విజయనగరం (13.50/13.52), కొత్తవలస (14.17/14.18), సింహాచలం (14.30/14.31) స్టేషన్ల మీదుగా ప్రయాణించి సాయంత్రం 16:00 (4:00) గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు మరియు పండుగలకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ మెము స్పెషల్ రైలు సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికులు ఈ తాత్కాలిక రైలు సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
{{/usCountry}}విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు మరియు పండుగలకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ మెము స్పెషల్ రైలు సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికులు ఈ తాత్కాలిక రైలు సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
{{/usCountry}}