...
...
Next Story

కృష్ణా జలాల పంపిణీ వివాదం : తెగని ఏపీ, తెలంగాణ వాటాలు - KRMB ఏం చేయబోతుంది..?

Andhra Pradesh Telangana Water Dispute : నాగార్జున సాగర్ నీటి వాటాలపై హైదరాబాద్‌లో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరు రాష్ట్రాల పరస్పర డిమాండ్లతో బోర్డు తుది నిర్ణయాన్ని వాయిదా వేసింది.

Published on: Nov 24, 2026, 14:38:39 IST
Advertisement

Andhra Pradesh Telangana Water Dispute : కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా ఇరు రాష్ట్రాల్లోనూ తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాల కోసం అందుబాటులో ఉన్న నీటిని పంచుకోవడంపై సోమవారం జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్ వేదికగా సోమవారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటి విడుదలపై ఇరు రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన డిమాండ్లను తెరపైకి తెచ్చాయి.

కృష్ణా పరివాహక ప్రాంతం - శ్రీశైలం డ్యామ్ (ఫైల్ ఫొటో)
కృష్ణా పరివాహక ప్రాంతం - శ్రీశైలం డ్యామ్ (ఫైల్ ఫొటో)

సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ అవసరాల నిమిత్తం 19 టీఎంసీల నీటిని కేటాయించాలని పట్టుబట్టింది. మరోవైపు…. వచ్చే ఫిబ్రవరి వరకు తమ రాష్ట్ర అవసరాల కోసం 21 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ గట్టిగా డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల మధ్య భిన్నమైన వాదనలు వినిపించడంతో, ప్రస్తుతానికి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేమని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. ఈ అంశంపై మరోసారి కూలంకషంగా చర్చించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామని బోర్డు వెల్లడించింది.

చుక్క నీరు కూడా ఇచ్చే ప్రసక్తే లేదు - తెలంగాణ

సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వాదనను స్పష్టం చేశారు. "నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకు, అలాగే కుడి, ఎడమ కాలువల పరిధిలోని అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని మేము బోర్డుకు తేల్చిచెప్పాము. కృష్ణా డెల్టాకు ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాము. హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు తీరిన తర్వాత మిగిలే 25 టీఎంసీల నీటి పంపిణీపై మాత్రమే చర్చించాలని ప్రతిపాదించాము," అని రమేష్ బాబు వివరించారు.

డెల్టా సాగునీటి కోసం పట్టుబట్టిన ఏపీ

"కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం తక్షణమే నీటిని విడుదల చేయాలని మేము సమావేశంలో పట్టుబట్టాం. ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని కోరుతూ మేము ఇప్పటికే 10 రోజుల క్రితమే కేఆర్‌ఎంబీకి లేఖ కూడా రాశాము" అని నరసింహమూర్తి పేర్కొన్నారు.

వేసవి ముంచుకొస్తున్న తరుణంలో జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటం ఇరు రాష్ట్రాలకు పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథయంలో కేఆర్ఎంబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks