...
...
Next Story

డిసెంబర్ 15 నుంచి ఇక్కడ నో హెల్మెట్.. నో పెట్రోల్ రూల్.. కఠినంగా అమలు!

డిసెంబర్ 15వ తేదీ నుంచి తిరుపతిలో నో హెల్మెట్.. నో పెట్రోల్ రూల్ కఠినంగా అమలు చేయనున్నారు పోలీసులు. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Published on: Dec 9, 2025, 11:25:55 IST
Advertisement

తిరుపతిలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు డిసెంబర్ 15 నుండి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయరు. రోడ్డు ప్రమాద సంబంధిత మరణాలను తగ్గించడానికి జిల్లా పోలీసులు 'నో హెల్మెట్–నో పెట్రోల్' నియమాన్ని కఠినంగా అమలు చేయనున్నారు.

నో హెల్మెట్, నో పెట్రోల్
నో హెల్మెట్, నో పెట్రోల్

జాతీయ రోడ్డు ప్రమాదాల డేటా ప్రకారం దాదాపు 45 శాతం ప్రమాద మరణాలు ద్విచక్ర వాహనదారుల వల్లే సంభవిస్తున్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అతివేగం, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నారు.

వాహనదారుడు, పిలియన్ రైడర్ ఇద్దరూ హెల్మెట్లు సరిగ్గా ధరిస్తే ఇలాంటి మరణాలలో 40 శాతం నివారించవచ్చని ఎస్పీ అన్నారు. రోడ్డు ప్రమాద మరణాలు కుటుంబంపై మానసికంగానే కాకుండా ఆర్థిక భారాన్ని కూడా కలిగిస్తాయన్నారు. దీనికి సంబంధించి, తిరుపతి జిల్లా పోలీసులు జిల్లా అంతటా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. ఇవి డిసెంబర్ 15 వరకు కొనసాగుతాయి.

'ప్రజలు ఈ నియమాన్ని అర్థం చేసుకోవడానికి, పాటించడానికి మేం తగినంత సమయం ఇస్తున్నాం. రైడర్, పిలియన్ రైడర్ ఇద్దరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. డిసెంబర్ 15 తర్వాత, హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ అన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల యజమానులకు ఈ అమలు ప్రణాళిక గురించి ఇప్పటికే సమాచారం అందించారు తిరుపతి పోలీసులు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయకూడదని, ఈ మేరకు పోలీసులకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఏపీలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. నవంబర్ 5వ తేదీ దాకా సగటున రోజుకు 50 ప్రమాదాలు జరగ్గా.. అందులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 53 మంది వరకు క్షతగాత్రులు అవుతున్నారు. వాహనాలు అతివేగంగా వెళ్లడం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అధిక ప్రమాదాలు ఉన్నాయి. క్లిష్టమైన జిల్లాలుగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గుర్తించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe