...
...
Next Story

అమరావతిని ఇక ఎవరూ టచ్ చేయలేరు.. ఏపీకి ఏకైక రాజధాని : సీఎం చంద్రబాబు

Capital Amaravati : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరూ అంగుళం కూడా కదల్చలేరని చెప్పారు. పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుపై స్పందించారు.

Published on: Apr 1, 2026, 19:23:15 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక అమరావతే ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎవరూ అంగుళం కూడా రాజధానిని కదల్చలేరని ఆయన అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని.. లోక్‌సభలో చట్టబద్దత బిల్లుకు ఆమోదం పొందటం ఆంధ్రులకు దక్కిన గౌరవమని సీఎం అన్నారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

బిల్లు ఆమోదంతో అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని చంద్రబాబు తెలిపారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి.. ఈ బిల్లుకు మద్దతు పలికిన పార్టీలకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. గత పాలకులు మూడు ముక్కలాటతో విధ్వంసం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆక్షేపించారు.

ప్రతీ నెలా మొదటి తేదీన పేదల సేవలో ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా పేదల సేవలో ఉంటున్నామని తెలిపారు. ప్రతీ నెలా రూ.2,750 కోట్లను పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్న ప్రభుత్వం ఏపీనే అని సీఎం వివరించారు. పొరుగున తమిళనాడులో కేవలం రూ. వెయ్యి మాత్రమే పెన్షన్ గా ఇస్తున్నారని అన్నారు. ప్రజలపై ఉన్న అభిమానంతోనే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని చేయగలుగుతున్నామని సీఎం వివరించారు.

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పాతచెరువుకు సోమశిల కాలువ నుంచి నీటిని తరలించేందుకు రూ.34 కోట్లతో పనులు చేపడతామని దీనిపై తక్షణం ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి చెరువును నింపుతామని భరోసా ఇచ్చారు. నీటి భద్రత కోసం స్థానిక వింజమూరు ప్రజలు వేసిన ఒక్క అడుగుకు ప్రజా ప్రభుత్వం వంద అడుగులు ముందుకు వేసి తోడుగా నిలబడుతుందన్నారు. రూ.70 లక్షల వ్యయంతో చెరువును పునరుద్ధరణకు తీసుకున్న చొరవను ముఖ్యమంత్రి అభినందించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇవాల్టి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 93 వేల చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకూ, 11,488 పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని తెలిపారు. దీని కోసం మొత్తం 153 కోట్లను వ్యయం చేస్తున్నామని.. ఉచిత విద్యుత్ పథకం వల్ల ఒక్కో చేనేత కుటుంబానికి వేల రూపాయల మేర ఆదా అవుతుందన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe