రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపల్, పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. ఇక కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా సమయం దగ్గరపడుతోంది. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు ఈనెల 13వ తేదీన ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,171 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 13న ఒకేసారి మూడు దశలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్లను విడుదల చేయడానికి చర్యలు వేగవంతం చేసింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ప్రణాళిక ప్రకారం మొదట తొలి దశ పోలింగ్‌కు మాత్రమే ఈ నెల 13న నోటిఫికేషన్ ఇవ్వాలని భావించింది. ఆ తర్వాత రెండు, మూడు దశల ఎన్నికలకు వరుసగా ఈ నెల 16, 19 తేదీల్లో నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించింది. అయితే….. తాజా సమీక్షలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 13వ తేదీనే మూడు దశల పంచాయతీ పోలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్లను ఒకేసారి జారీ చేయనున్నారు.
ఎన్నికల పోలింగ్ తేదీలు :
- తొలి దశ పోలింగ్ : 26 నవంబర్ , 2026
- రెండో దశ పోలింగ్ : 29, నవంబర్, 2026
- మూడో దశ పోలింగ్ : 2 డిసెంబర్, 2026
తొలి దశ పంచాయతీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్బీ) కూడా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
తొలి దశలో ఏయే పంచాయతీలకు పోలింగ్ నిర్వహించాలనే అంశంపై జిల్లా కలెక్టర్లు ఇప్పటికే తమ నివేదికలను….. ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. పట్టణ స్థానిక సంస్థలకు కూడా తొలి దశలోనే పోలింగ్ జరుగుతుండటంతో, అధికారుల పనిభారం మరియు భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని మొదటి దశలో గ్రామ పంచాయతీల సంఖ్యను సాధ్యమైనంత తక్కువగా ఉంచడమే మేలని కలెక్టర్లు అభిప్రాయపడ్డారు. మిగిలిన గ్రామ పంచాయతీలన్నింటికీ రెండు, మూడు దశల్లో సజావుగా పోలింగ్ పూర్తయ్యేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎన్నికల కమిషన్‌కు సూచించారు.
మూడు దశల్లో పంచాయతీ పోలింగ్ నిర్వహణ, శాంతిభద్రతలు, ఎన్నికల సన్నద్ధతపై సమగ్రంగా చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పునేఠా అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో (ఎస్పీలు) ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
{{/usCountry}}మూడు దశల్లో పంచాయతీ పోలింగ్ నిర్వహణ, శాంతిభద్రతలు, ఎన్నికల సన్నద్ధతపై సమగ్రంగా చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పునేఠా అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో (ఎస్పీలు) ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
{{/usCountry}}స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల వేళ పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా… పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. గ్రామాల్లో శాంతి భద్రతలకు ఇబ్బందులు రాకుండా…పక్కాగా ఏర్పాట్లు చేసేలా పోలీస్ శాఖతో సమన్వయం చేయనుంది.