...
...
Next Story

గుంటూరు నుంచి తిరుచానూరుకు వన్‌వే స్పెషల్ ట్రైన్ - టైమింగ్స్, రూట్ వివరాలివే!

పండుగల వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. అయితే రద్దీని తగ్గించేందుకు వీలుగా గుంటూరు నుంచి తిరుచానూరుకు అక్టోబర్ 13న ప్రత్యేక రైలు నడుపనున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే ప్రకటించింది.

Published on: Oct 11, 2026, 12:21:23 IST
Advertisement

పండుగ సీజన్‌లో సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులు, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ కోస్తా రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు డివిజన్ పరిధి నుంచి తిరుచానూరుకు ఒక ప్రత్యేక వన్‌వే సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 13వ తేదీ మంగళవారం సాయంత్రం గుంటూరులో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం తిరుచానూరు చేరుకుంటుంది.

టైమింగ్స్ వివరాలు…

గుంటూరు నుంచి తిరుచానూరుకు వన్‌వే స్పెషల్ రైలు
గుంటూరు నుంచి తిరుచానూరుకు వన్‌వే స్పెషల్ రైలు

రైలు నంబర్ 07227 ప్రత్యేక రైలు అక్టోబర్ 13న సాయంత్రం 19:15 గంటలకు గుంటూరు జంక్షన్‌లో బయలుదేరుతుంది. ఈ రైలు పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల మీదుగా ప్రయాణించి అక్టోబర్ 14వ తేదీ ఉదయం 07:30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.

  • నరసరావుపేట: వచ్చిచేరు వేళ 20:00 / బయలుదేరు వేళ 20:01
  • వినుకొండ: 20:29 / 20:30
  • దొనకొండ: 20:59 / 21:00
  • మార్కాపురం రోడ్: 21:24 / 21:25
  • కంభం : 21:49 / 21:50
  • గిద్దలూరు: 22:24 / 22:25
  • నంద్యాల: 00:30 / 00:35
  • బనగానపల్లె: 00:59 / 01:00
  • కోయిల్ కుంట్ల: 01:11 / 01:12
  • జమ్మలమడుగు: 02:03 / 02:05
  • ప్రొద్దుటూరు: 02:23 / 02:25
  • ఎర్రగుంట్ల: 02:48 / 02:50
  • కమలాపురం: 03:13 / 03:15
  • కడప: 03:43 / 03:45
  • నందలూరు: 04:18 / 04:20
  • రాజంపేట: 04:33 / 04:35
  • కోడూరు: 04:58 / 05:00
  • రేణిగుంట జంక్షన్: 05:58 / 06:00
  • తిరుచానూరు: 07:30 (గమ్యస్థానం)

ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్‌లను ఏర్పాటు చేశారు. అందులో 8 ఏసీ కోచ్‌లు 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మరియు 2 ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అధికారిక రైల్వే పోర్టల్స్ లేదా విచారణ కేంద్రాల ద్వారా టికెట్ల లభ్యత, రైలు వేళలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks