దేశ భద్రతకే సవాలుగా మారిన పాకిస్థాన్ గూఢచర్య నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం బట్టబయలు చేసింది. ఆపరేషన్ ఫైర్‌వాల్-2026 పేరుతో చేపట్టిన ఈ భారీ డ్రైవ్‌లో పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఏపీ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

భారత నావికాదళానికి చెందిన సున్నితమైన రక్షణ సమాచారాన్ని శత్రుదేశానికి చేరవేస్తున్నారనే పక్కా సమాచారంతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు చెందిన 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 18 మందిని అనుమానితులుగా గుర్తించగా, వారిలో 13 మంది భారత నావికాదళానికి చెందిన సిబ్బంది కావడం గమనార్హం.
తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రదీప్ ముఖర్జీ అనే నేవీ ఉద్యోగిని అరెస్ట్ చేయడంతో ఈ స్పై నెట్‌వర్క్ గుట్టు రట్టయింది. ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ క్రమంలో కీలక పాత్ర పోషించిన కాంట్రాక్ట్ డ్రైవర్ సాయి వరప్రసాద్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించడంతో విశాఖపట్నం జిల్లా జైలుకు తరలించారు. మిగిలిన 16 మంది అనుమానితుల పాత్రపై సీఐతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి.‘
విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్‌తో పాటు కీలక రక్షణ సంస్థలకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలు, సమాచారమే లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచారులు ఈ కుట్ర పన్నినట్లు అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ ద్వారా పాక్ ఏజెంట్లు వ్యామోహంలో పడేసి (హనీట్రాప్) నావికాదళ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందిని తమ బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తోంది.
పట్టుబడకుండా ఉండేందుకు అత్యంత భద్రత కలిగిన ప్రైవేట్, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేశారు. సోదాల సందర్భంగా అనుమానితుల నుంచి స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.
{{/usCountry}}పట్టుబడకుండా ఉండేందుకు అత్యంత భద్రత కలిగిన ప్రైవేట్, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేశారు. సోదాల సందర్భంగా అనుమానితుల నుంచి స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.
{{/usCountry}}గతంలోనూ విశాఖపట్నం నావల్ కమాండ్‌ను లక్ష్యంగా చేసుకుని పాక్ గూఢచర్య సంస్థలు పలుమార్లు హనీట్రాప్ యత్నాలు చేశాయి. ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ వంటి గత ఆపరేషన్ల ద్వారా కొందరు నేవీ సిబ్బందితో పాటు హవాలా ఏజెంట్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’ లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్లు, హవాలా మార్గాల ద్వారా డబ్బులు చేతులు మారాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పరికరాల ఆధారంగా డిజిటల్ డేటాను విశ్లేషిస్తున్న అధికారులు, ఈ నెట్‌వర్క్‌లో మరికొందరు ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
విచారణ సందర్బంగా పాక్ ఏజెంట్లతో నేవీ సిబ్బంది రహస్య సంబంధాలు బయటపడ్డాయి. విశాఖ కేంద్రంగా ఈ గూఢచర్యం జరిగింది. డేటాను ఎన్‌క్ట్రిప్టెడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా శుత్రదేశానికి ఈ నెట్ వర్క్ చేరవేస్తున్నట్టుగా గుర్తించారు.