శ్రీకాకుళం పట్టణంలో అకస్మాత్తుగా డయేరియా ప్రబలింది. నగరంలో చాలా మందికి విరేచనాలు అవ్వడంతో మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సమస్యలపై ఆందోళన మెుదలైంది. ప్రస్తుతానికి డయేరియాతో ఒకరు మరణించినట్టుగా తెలుస్తోంది. 70 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన ఐదుగురు మరణించడం ఘటన మరవకముందే.. శ్రీకాకులంలో అనేక మంది ఆసుపత్రి పాలవడం కలవరపెడుతుంది.

మొత్తం 76 అనుమానిత కేసులు గుర్తించారు అధికారులు. మొత్తం 54 మంది రోగులు కిమ్స్‌తో సహా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కోమోర్బిడిటీలతో ఒక మరణం కూడా నమోదైంది. మృతుడిని పట్టణంలోని దమ్మలవీధికి చెందిన 50 ఏళ్లు పైబడిన సురేష్‌గా గుర్తించారు. మరో ఇద్దరు రోగులు వెంటిలేటర్ మీద ఉన్నారు. వారి పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నీటి నమూనాలను పరీక్ష కోసం విశాఖపట్నంలోని ప్రయోగశాలకు పంపామని చెప్పారు. శ్రీకాకుళం, విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు నీటి నమూనాలను పంపినట్టుగా అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించడానికి కట్టుబడి ఉందని శ్రీకాకుళం కలెక్టర్ చెప్పారు. కాకి వీధి, దమ్మల వీధి, గుడి వీధి, కాండ్ర వీధిలో ఈ వ్యాధి కేంద్రీకృతమై ఉంది.
ఇటీవలి రోడ్డు విస్తరణ పనుల వల్ల నీటి కాలుష్యం సంభవించిందని చాలామంది అనుమానిస్తున్నారు. దీనివల్ల మున్సిపల్ పైపులైన్లు దెబ్బతిన్నాయని, డ్రైనేజీ నీరు తాగునీటి సరఫరా లైన్లలోకి చొచ్చుకుపోయిందని భావిస్తున్నారు. పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తోందని అన్నారు. పైప్‌లైన్ లీకేజీలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి, బాధితులందరికీ ఉత్తమ చికిత్స" అందించాలని వైద్య శాఖను ఆదేశించారు.
ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ నీటి సరఫరాను వెంటనే నిలిపివేయాలని, ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని, పట్టణం అంతటా క్లోరినేషన్‌ను ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రోడ్డు మరమ్మతు పనులు సరిగా లేకపోవడం, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు లేకపోవడం వల్లే ఈ కాలుష్యం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. వెంటిలేటర్లపై ఉన్న రోగులను పర్యవేక్షించడానికి ప్రభుత్వం సీనియర్ నిపుణులను నియమించాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది.
{{/usCountry}}ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ నీటి సరఫరాను వెంటనే నిలిపివేయాలని, ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని, పట్టణం అంతటా క్లోరినేషన్‌ను ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రోడ్డు మరమ్మతు పనులు సరిగా లేకపోవడం, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు లేకపోవడం వల్లే ఈ కాలుష్యం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. వెంటిలేటర్లపై ఉన్న రోగులను పర్యవేక్షించడానికి ప్రభుత్వం సీనియర్ నిపుణులను నియమించాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది.
{{/usCountry}}మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో కమిషనర్ కూర్మారావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సస్పెండ్ వేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వం పలు ప్రాంతాల్లో సర్వే చేసింది. వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి స్వల్ప లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందిస్తోంది. నగర పాలక సంస్థ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తోంది.
శ్రీకాకుళం నివాసితులకు అధికారుల సేఫ్టీ టిప్స్
- కుళాయి నీటిని నివారించండి: తదుపరి నోటీసు వచ్చే వరకు తాగడానికి లేదా వంట చేయడానికి మున్సిపల్ కుళాయి నీటిని ఉపయోగించవద్దు.
- నీటిని మరిగించండి: ఏదైనా స్థానిక నీటి వనరును ఉపయోగిస్తుంటే.. వినియోగించే ముందు దానిని బాగా మరిగించండి.
- లక్షణాలను చెప్పండి : వాంతులు లేదా డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లేదా సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి.
- ఎమర్జెన్సీ నెంబర్: 08942-229080