శ్రీకాకుళంలో డయేరియా కలకలం.. సేఫ్టీ టిప్స్ చెప్పిన అధికారులు.. ఎమర్జెన్సీ నెంబర్ ఇదే

రాజమహేంద్రవరం కల్తీ పాలన ఘటన మరవకముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో సమస్య కలకలం రేపింది. శ్రీకాకుళంలో డయేరియాతో పలువురు ఆసుపత్రుల్లో చేరారు.

Published on: Feb 25, 2026, 15:38:11 IST
By , Srikakulam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీకాకుళం పట్టణంలో అకస్మాత్తుగా డయేరియా ప్రబలింది. నగరంలో చాలా మందికి విరేచనాలు అవ్వడంతో మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సమస్యలపై ఆందోళన మెుదలైంది. ప్రస్తుతానికి డయేరియాతో ఒకరు మరణించినట్టుగా తెలుస్తోంది. 70 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన ఐదుగురు మరణించడం ఘటన మరవకముందే.. శ్రీకాకులంలో అనేక మంది ఆసుపత్రి పాలవడం కలవరపెడుతుంది.

శ్రీకాకుళంలో డయేరియా కలకలం
శ్రీకాకుళంలో డయేరియా కలకలం

మొత్తం 76 అనుమానిత కేసులు గుర్తించారు అధికారులు. మొత్తం 54 మంది రోగులు కిమ్స్‌తో సహా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కోమోర్బిడిటీలతో ఒక మరణం కూడా నమోదైంది. మృతుడిని పట్టణంలోని దమ్మలవీధికి చెందిన 50 ఏళ్లు పైబడిన సురేష్‌గా గుర్తించారు. మరో ఇద్దరు రోగులు వెంటిలేటర్ మీద ఉన్నారు. వారి పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నీటి నమూనాలను పరీక్ష కోసం విశాఖపట్నంలోని ప్రయోగశాలకు పంపామని చెప్పారు. శ్రీకాకుళం, విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు నీటి నమూనాలను పంపినట్టుగా అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించడానికి కట్టుబడి ఉందని శ్రీకాకుళం కలెక్టర్ చెప్పారు. కాకి వీధి, దమ్మల వీధి, గుడి వీధి, కాండ్ర వీధిలో ఈ వ్యాధి కేంద్రీకృతమై ఉంది.

ఇటీవలి రోడ్డు విస్తరణ పనుల వల్ల నీటి కాలుష్యం సంభవించిందని చాలామంది అనుమానిస్తున్నారు. దీనివల్ల మున్సిపల్ పైపులైన్లు దెబ్బతిన్నాయని, డ్రైనేజీ నీరు తాగునీటి సరఫరా లైన్లలోకి చొచ్చుకుపోయిందని భావిస్తున్నారు. పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తోందని అన్నారు. పైప్‌లైన్ లీకేజీలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి, బాధితులందరికీ ఉత్తమ చికిత్స" అందించాలని వైద్య శాఖను ఆదేశించారు.

ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ నీటి సరఫరాను వెంటనే నిలిపివేయాలని, ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని, పట్టణం అంతటా క్లోరినేషన్‌ను ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రోడ్డు మరమ్మతు పనులు సరిగా లేకపోవడం, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు లేకపోవడం వల్లే ఈ కాలుష్యం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. వెంటిలేటర్లపై ఉన్న రోగులను పర్యవేక్షించడానికి ప్రభుత్వం సీనియర్ నిపుణులను నియమించాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది.

మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో కమిషనర్ కూర్మారావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సస్పెండ్ వేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వం పలు ప్రాంతాల్లో సర్వే చేసింది. వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి స్వల్ప లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందిస్తోంది. నగర పాలక సంస్థ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తోంది.

శ్రీకాకుళం నివాసితులకు అధికారుల సేఫ్టీ టిప్స్

  • కుళాయి నీటిని నివారించండి: తదుపరి నోటీసు వచ్చే వరకు తాగడానికి లేదా వంట చేయడానికి మున్సిపల్ కుళాయి నీటిని ఉపయోగించవద్దు.
  • నీటిని మరిగించండి: ఏదైనా స్థానిక నీటి వనరును ఉపయోగిస్తుంటే.. వినియోగించే ముందు దానిని బాగా మరిగించండి.
  • లక్షణాలను చెప్పండి : వాంతులు లేదా డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లేదా సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి.
  • ఎమర్జెన్సీ నెంబర్: 08942-229080
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More