ఆంధ్రప్రదేశ్లోని పీజీ వైద్య విద్య అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ(Dr.NTRUHS) 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పీజీ (మెడికల్) డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ పీజీ-2026 అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ ప్రవేశాల ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని అన్ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో పాటు నూతనంగా అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం అక్టోబర్ 19 సాయంత్రం 4:00 గంటల నుండి మెుదలవుతుంది. దరఖాస్తు ముగింపు తేదీ అక్టోబర్ 23 రాత్రి 10:00 గంటల వరకు ఉంటుంది.
లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకునే అవకాశం అక్టోబర్ 24 (ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే) ఇచ్చారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత దరఖాస్తు చేయడానికి అవకాశం ఉండదు. అర్హత కలిగిన అభ్యర్థులు వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.
అభ్యర్థులు సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవాలి. నీట్ పీజీ - 2026 అడ్మిట్ కార్డ్, ర్యాంక్ కార్డ్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్, ప్రొవిజనల్ సర్టిఫికెట్, కంపల్సరీ రోటేటింగ్ ఇంటర్న్షిప్ పూర్తి చేసిన సర్టిఫికెట్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్ చివరి సంవత్సరం వరకు ఉన్న మార్కుల మెమోలు, 10వ తరగతి మార్కుల జాబితా(వయస్సు నిర్ధారణ కోసం), ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్ / పాస్పోర్ట్), కమ్యూనిటీ / క్యాస్ట్ సర్టిఫికెట్ (వర్తించే వారికి) కావాలి. ఎన్ఆర్ఐ కోటా అభ్యర్థులకు అవసరమైన ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ పత్రాలు, డిక్లరేషన్ ఫారమ్లు కూడా ఉండాలి.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు తిరస్కరిస్తారు. అధికారిక వెబ్సైట్ https://drntr.uhsap.inలో అప్లై చేయాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్, మెరిట్ జాబితా, సీట్ల కేటాయింపుకు సంబంధించిన తాజా అప్డేట్ల కోసం క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా హెల్త్ యూనివర్సిటీ అధికారులు సూచించారు.
{{/usCountry}}అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులు తిరస్కరిస్తారు. అధికారిక వెబ్సైట్ https://drntr.uhsap.inలో అప్లై చేయాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్, మెరిట్ జాబితా, సీట్ల కేటాయింపుకు సంబంధించిన తాజా అప్డేట్ల కోసం క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా హెల్త్ యూనివర్సిటీ అధికారులు సూచించారు.
{{/usCountry}}