...
...
Next Story

అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి - ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Published on: Dec 12, 2025 10:24 AM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి -చింతూరు ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా… 20 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమన్నారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు.

ఘాట్ రోడ్డులో ప్రమాదం….

చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులను చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య సేవలు కొనసాగుతున్నాయని అల్లూరి జిల్లా కలెక్టర్ తెలిపారు.

“అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడి పలువురు భక్తులు మృతి చెందారన్న వార్త కలిచివేసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులను సహాయక చర్యల కోసం అప్రమత్తం చేయడం జరిగింది. ప్రమాద స్థలంలో క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీపంలోని చింతూరు ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం జరిగింది” అని హోంమంత్రి అనిత వంగలపూడి ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe