Srisailam Devasthanam Board Decisions : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల దర్శనాల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు దేవస్థానం ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీశైల దేవస్థానంలో ప్రొటోకాల్ దర్శనాల్లో సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యులందరితో విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ మార్పులను ఖరారు చేశారు.

ఈ కీలక సమావేశంలో 45 అంశాలపై సమగ్రంగా చర్చించి…. అందులో 39 కీలక అంశాలకు ఆమోదముద్ర వేశారు. సాధారణ భక్తులు గంటల తరబడి వేచి ఉండే ఇబ్బందులు తొలగించి, మరింత సులభంగా దర్శనం కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని ధర్మకర్తల మండలి ఛైర్మన్ రమేష్ నాయుడు స్పష్టం చేశారు.
ఆగస్టు 15 నుంచి కొత్త విధానం
- నూతన రూల్స్ ప్రకారం… ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సిఫార్సు లేఖలపై ఇచ్చే ప్రోటోకాల్ టికెట్లను వచ్చే నెల ఆగస్టు 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారానే జారీ చేస్తారు.
- ఈ ప్రోటోకాల్ దర్శనం కోరుకునే వారు దర్శన సమయానికి కనీసం 48 గంటల ముందే తమ సిఫార్సు లేఖలను ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
- ఈ మార్పు ద్వారా భక్తుల రద్దీని సులభంగా నియంత్రించడంతో పాటు, దర్శన వేళల్లో మరింత పారదర్శకత వస్తుందని పాలకమండలి భావిస్తోంది.
- ప్రముఖుల సిఫార్సు లేఖల పేరిట జరిగే అక్రమాలను అరికట్టడంతో పాటు, సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా వేగంగా దర్శనం పొందేందుకు ఈ చర్యలు ఎంతగానో తోడ్పడతాయని ఆలయ ఛైర్మన్ పేర్కొన్నారు.
మరిన్ని నిర్ణయాలు..
ఇక శ్రీశైలం క్షేత్రాభివృద్ధిలో భాగంగా భక్తుల వసతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. నూతన క్యూ కాంప్లెక్స్, ఏ-గ్రేడ్ శౌచాలయాలు, స్నానపు గదుల నిర్మాణం, తిరుమల తరహాలో పీఏసీ (పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటును ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని నిర్ణయించారు. భక్తుల రాకపోకల సౌకర్యార్థం హిందూమాల సత్రం నుంచి కుమార సదనం వరకు…. యోగివేమారెడ్డి సత్రం వెనుక భాగంలో రూ. 24 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా సిమెంట్ కాంక్రీట్ రోడ్డును నిర్మించనున్నారు.
{{/usCountry}}ఇక శ్రీశైలం క్షేత్రాభివృద్ధిలో భాగంగా భక్తుల వసతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. నూతన క్యూ కాంప్లెక్స్, ఏ-గ్రేడ్ శౌచాలయాలు, స్నానపు గదుల నిర్మాణం, తిరుమల తరహాలో పీఏసీ (పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటును ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని నిర్ణయించారు. భక్తుల రాకపోకల సౌకర్యార్థం హిందూమాల సత్రం నుంచి కుమార సదనం వరకు…. యోగివేమారెడ్డి సత్రం వెనుక భాగంలో రూ. 24 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా సిమెంట్ కాంక్రీట్ రోడ్డును నిర్మించనున్నారు.
{{/usCountry}}రాబోయే శ్రావణ మాసంలో భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన గోపురాలకు రంగురంగుల విద్యుద్దీపాలంకరణ చేయనున్నారు. భక్తుల విశ్రాంతి కోసం నందీశ్వర మరియు నీలకంఠేశ్వర డార్మెటరీలలో డక్టబుల్ ఎయిర్ కూలర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అలాగే క్యూ కాంప్లెక్సులో అదనపు వాటరు కూలర్లను అమర్చనున్నారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి…. సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండి దేశం సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ ఆగమశాస్త్రానుసారంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆగస్టు 7 నుంచి 11వ తేదీ వరకు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక అర్చనలు, హోమాలు, జపాలు మరియు పారాయణలు శాస్త్రోక్తంగా జరుగుతాయి.
శాకంభరీ ఉత్సవాలు, రాబోయే శ్రావణ మాసోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీశైల దేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతిలో ఆగస్టు 7న (శుక్రవారం) సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.