ద్రోణి ప్రభావంతో ఆంధ్రాకు వర్ష సూచన - తెలంగాణలో రాబోయే 5 రోజులు ఇలా..?

ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30-50 కిమీ వేగంతో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని హెచ్చరించింది.

Updated on: Nov 10, 2026, 09:44:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల నేపథ్యంలో… వానలు పడే సూచనలున్నాయి.

ద్రోణి ప్రభావంతో ఆంధ్రాకు వర్ష సూచన (Image From @APSDMA)
ద్రోణి ప్రభావంతో ఆంధ్రాకు వర్ష సూచన (Image From @APSDMA)

ప్రస్తుతం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మరియు జార్ఖండ్ మీదుగా ఈశాన్య ఉత్తరప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఇదిలా ఉంటే రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడొచ్చని…. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 13 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం పరిధిలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో (క్షణానికి 50 కిమీ వేగానికి చేరేలా) బలమైన ఈదురుగాలులు వీచే వీలుందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే ముప్పు కూడా ఉందని స్పష్టం చేసింది. రాయలసీమ జిల్లాలో వాతావరణ పరిస్థితి

రాయలసీమ ప్రాంతంలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ కూడా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు సంభవించే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ నిలబడకూడదని సూచించారు.

తెలంగాణలో పొడి వాతావరణం

మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ చూస్తే… పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. రాబోయే ఐదారు రోజుల పాటు వర్ష సూచనలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఎలాంటి తీవ్ర వాతావరణ హెచ్చరికలు లేవని పేర్కొంది.

మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సాయంత్రం దాటితే చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం సమయంలో పొగమంచు కూడా కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More