AP Weather : బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన, ఐఎండీ అంచనాలివే
Andhra Pradesh Weather Updates : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల రెండ్రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Andhra Pradesh weather Updates : తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల కదలికలు చురుగ్గా సాగుతున్న వేళ…. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు కోస్తాంధ్రను పలకరించనున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో కేంద్రీకృతమైన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.
ఉత్తరాంధ్రకు అలర్ట్…
ఈ వాతావరణ వ్యవస్థ రాబోయే గంటల్లో మరింత తీవ్రం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అల్పపీడనం ఈరోజు నాటికి 'స్పష్టమైన అల్పపీడనం'గా (Well Marked Low Pressure Area) బలపడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇది క్రమంగా బలపడుతూ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.
ఈ అల్పపీడన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలపై స్పష్టమైన ప్రభావం కనిపించనుంది. ముఖ్యంగా ఇవాళ, రేపు (రాగల 48 గంటల్లో) ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని… ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఉత్తర కోస్తాంధ్ర - యానాం :
- ఇవాళ (జూలై 16): కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు వడగాల్పుల తీవ్రత ఉంటుంది.
- రేపు (జూలై 17): కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా… గాలి వేగం అదే స్థాయిలో కొనసాగుతుంది. వాతావరణంలో వేడి, తేమ పెరిగి ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది.
దక్షిణ కోస్తాంధ్ర :
- ఇవాళ (జూలై 16): ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి కురిసే అవకాశం ఉంది. 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
- రేపు (జూలై 17): తేలికపాటి జల్లులు కురుస్తాయి. గాలి వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఉక్కపోతతో కూడిన అసౌకర్యకర వాతావరణం ఉంటుంది.
రాయలసీమ:
- ఇవాళ (జూలై 16): ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడవచ్చు. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, వడగాల్పుల తీవ్రత ఉంటుంది.
- రేపు (జూలై 17): తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 30-40 కిలోమీటర్లకు తగ్గినప్పటికీ… ఉక్కపోత తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

