AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ఉపశమనం కలిగించే వర్ష సూచనలతో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఉంటుండగా.., తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీ వెదర్ రిపోర్ట్ : వడగాలులు - వర్ష సూచన

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రిపోర్ట్ ప్రకారం.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు , మరో 67 మండలాల్లో సాధారణ వడగాల్పులు (Heat Wave) వీచే అవకాశం ఉంది. ఈ కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
- 42°C నుంచి 44°C వరకు నమోదయ్యే జిల్లాలు : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం.
- 40°C నుంచి 42°C వరకు నమోదయ్యే జిల్లాలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు.
ప్రజలు అత్యవసర పనులపై బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వేడిగాలి నేరుగా శరీరానికి తగలకుండా కండువా లేదా టోపీని ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఇవాళ, రేపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిలబడకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలంగాణకు వర్ష సూచన :
తెలంగాణలోనూ వాతావరణం చల్లబడింది. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణం చల్లబడనుంది. రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
- జూన్ 8 నుంచి జూన్ 9 వరకు : తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు మరియు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- జూన్ 10 నుంచి జూన్ 11 వరకు : కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

జూన్ 9 నుంచి వర్షాల ప్రభావం పెరిగే సూచనలు ఉండటంతో… ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. జూన్ 13వ తేదీ వరకు కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాాతావరణ కేంద్రం తెలిపింది.