Weather Report : ఏపీలో ఎండలతో పాటు వానలు - తెలంగాణకు 5 రోజులపాటు వర్ష సూచన..!

AP Telangana Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులున్నాయి. ఓవైపు వడగాల్పులు వీస్తుండగా… మరికొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Published on: Jun 8, 2026, 07:19:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ఉపశమనం కలిగించే వర్ష సూచనలతో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఉంటుండగా.., తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వర్ష సూచన (image source @APSDMA X)
వర్ష సూచన (image source @APSDMA X)

ఏపీ వెదర్ రిపోర్ట్ : వడగాలులు - వర్ష సూచన

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రిపోర్ట్ ప్రకారం.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు , మరో 67 మండలాల్లో సాధారణ వడగాల్పులు (Heat Wave) వీచే అవకాశం ఉంది. ఈ కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

  • 42°C నుంచి 44°C వరకు నమోదయ్యే జిల్లాలు : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం.
  • 40°C నుంచి 42°C వరకు నమోదయ్యే జిల్లాలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు.

ప్రజలు అత్యవసర పనులపై బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వేడిగాలి నేరుగా శరీరానికి తగలకుండా కండువా లేదా టోపీని ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఇవాళ, రేపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద, కరెంట్ స్తంభాల వద్ద నిలబడకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

తెలంగాణకు వర్ష సూచన :

తెలంగాణలోనూ వాతావరణం చల్లబడింది. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణం చల్లబడనుంది. రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

  • జూన్ 8 నుంచి జూన్ 9 వరకు : తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు మరియు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • జూన్ 10 నుంచి జూన్ 11 వరకు : కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

జూన్ 9 నుంచి వర్షాల ప్రభావం పెరిగే సూచనలు ఉండటంతో… ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. జూన్ 13వ తేదీ వరకు కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాాతావరణ కేంద్రం తెలిపింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More