AP Weather Updates : కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం - ఈ 2 రోజులు వర్షంతో పాటు ఈదురు గాలులు..!
Andhra Pradesh Weather Report : ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే సూచనలున్నాయి.
Andhra Pradesh Weather Report : ఏపీకి వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం…. సముద్ర మట్టానికి 1.5 నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తులో, ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ మరియు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. అంతేకాకుండా దక్షిణ ఒడిశా మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
నిన్నటి రోజున ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం నుండి ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు ఉత్తర తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు (సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో) విస్తరించిన ద్రోణి ఈరోజు తక్కువగా (బలహీనపడి) గుర్తించబడినది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి మరియు పశ్చిమ దిశల నుండి గాలులు వీస్తున్నాయి.
తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల గాలులు వీచే సూచనలున్నాయి.
ఉత్తర, దక్షిణ కోస్తా :
- ఇవాళ కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
- రేపు మరియు ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతం:
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమ పరిధిలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
మరోవైపు ఇవాళ ఉదయం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని కాకినాడ, పోలవరంలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చాలాచోట్ల రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. ఉదయం పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన కూడల్లో వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

