...
...
Next Story

వెదర్ రిపోర్ట్ : ఉపరితల ఆవర్తన ప్రభావం - ఇవాళ, రేపు వర్షాలు..! ఎల్లుండి నుంచి తెలంగాణలో పొడి వాతావరణం

తూర్పు తెలంగాణ, కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

Published on: Nov 6, 2026, 17:12:47 IST
Advertisement

తూర్పు తెలంగాణ దానిని అనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతాలపై నిన్నటి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వెదర్ రిపోర్ట్
వెదర్ రిపోర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ఏడు రోజుల వాతావరణ నివేదిక ప్రకారం…నవంబర్ 6 నుండి 7 ఉదయం వరకు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

నవంబర్ 7 నుంచి 8 వరకు చూస్తే…. ఒకట్రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. అయితే ఎలాంటి తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు లేవు. నవంబర్ 8 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం (Dry Weather) నెలకుంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఏపీ వెదర్ రిపోర్ట్…

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం…. కోస్తాంధ్ర - యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నవంబర్ 9న కూడా ఉరుములు, ఈదురుగాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రిపోర్ట్ ప్రకారం… ఇవాళ అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks