ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (APTA), ప్రముఖ రైడ్-హేలింగ్ సంస్థ రాపిడో' సంయుక్తంగా డ్రైవర్-కమ్-గైడ్ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఆటో, బైక్ డ్రైవర్లను సర్టిఫైడ్ టూరిస్ట్ గైడ్లుగా తీర్చిదిద్దనున్నారు.

వైజాగ్ లోని APTDC యాత్రి నివాస్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉండే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో మొదటి విడతగా 1,000 మందికి పైగా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కేవలం విశాఖపట్నం నుంచే తొలి దశలో 350 మంది డ్రైవర్లను ఎంపిక చేసి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు.
ట్రైనింగ్‌లో ఏం నేర్పిస్తారు?
ఈ వినూత్నమైన కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన డ్రైవర్లకు 6 గంటల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అందులో పర్యాటక ప్రాంతాల పూర్తి సమాచారం, పర్యాటకులతో ప్రవర్తించే విధానం, ప్రయాణ ప్రణాళిక రూపకల్పన నేర్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి డ్రైవర్‌కు APTA రూపొందించిన ద్విభాషా (ఇంగ్లీష్-తెలుగు) హ్యాండ్‌బుక్‌ను అందజేస్తారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక టూర్ సర్క్యూట్‌ల గురించిన పూర్తి సమాచారం ఉంటుంది.
గంటల లెక్కన ప్యాకేజీలు
ట్రైనింగ్ పూర్తి చేసుకుని సర్టిఫికేట్ పొందిన డ్రైవర్లను రాపిడో యాప్‌లో ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేస్తారు. పర్యాటకులు తమ అవసరాలకు అనుగుణంగా గంటల లెక్కన బుక్ చేసుకోవచ్చు. ఇందులో 4 గంటల ప్యాకేజీ, 6 నుండి 8 గంటల ప్యాకేజీ, పూర్తి రోజు టూర్ సర్క్యూట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
భారతదేశంలో ఒక ప్రభుత్వ పర్యాటక శాఖ, ఇలాంటి ప్రైవేట్ రైడ్-షేరింగ్ యాప్‌తో చేతులు కలపడం ఇదే తొలిసారి కావడం విశేషం. విజయవాడలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వైజాగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. త్వరలో తిరుపతిలోనూ ఈ ప్రాజెక్ట్ ప్రారంభంకానుంది.
{{/usCountry}}భారతదేశంలో ఒక ప్రభుత్వ పర్యాటక శాఖ, ఇలాంటి ప్రైవేట్ రైడ్-షేరింగ్ యాప్‌తో చేతులు కలపడం ఇదే తొలిసారి కావడం విశేషం. విజయవాడలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వైజాగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. త్వరలో తిరుపతిలోనూ ఈ ప్రాజెక్ట్ ప్రారంభంకానుంది.
{{/usCountry}}గత నవంబర్ 2025లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాపిడో సంస్థ వ్యవస్థాపకుల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సరైన గైడ్లు దొరక్క టూరిస్టులు పడే ఇబ్బందులను తొలగించడమే కాకుండా, స్థానిక డ్రైవర్లకు అదనపు ఆదాయాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.
ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా తిరుమల వచ్చే భక్తులకు, వైజాగ్ సందర్శించే పర్యాటకులకు ఆటో లేదా బైక్ ఎక్కగానే నమ్మకమైన సమాచారం లభిస్తుంది. అంతేకాదు గంటల వారీగా బుకింగ్ సిస్టమ్ ఉండటం వల్ల పర్యాటకులు మోసపోయే అవకాశం ఉండదు. డిజిటల్ టూరిజంలో ఏపీ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుంది.