మావోయిస్టు అగ్రనేతలుగా పేరొందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి బంధువులు గురువారం హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దేవ్ జీ సోదరుడు తిప్పిరి గంగాధర్ (55), రాజిరెడ్డి కుమార్తె స్నేహలత (55) ఈ పిటిషన్ దాఖలు చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో నవంబర్ 18న ఆరుగురు, నవంబర్ 19న ఏడుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కీలక నేతలైన దేవ్ జీ, రాజిరెడ్డి కూడా ఏపీ పోలీసుల అదుపులోనే ఉన్నారన్న వార్తలు బయటికి వచ్చాయి. దేవ్ జీకి భద్రత కల్పించే సభ్యులు ఏపీలో అరెస్ట్ కూడా అయ్యారు. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ తో పాటు ఏకకాలంలో చాలా మంది మావోయిస్టుల అరెస్ట్ వంటి పరిణామాలు దేవ్ జీ ఏపీ పోలీసుల అదుపులోనే ఉన్నాడన్న అనుమానాలకు బలం చేకూర్చాయి.
మా ఆధీనంలో లేరు - కోర్టుకు తెలిపిన పోలీసులు
ఈ నేపథ్యంలోనే దేవ్ జీతో పాటు రాజిరెడ్డి కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలంటూ హెబియస్‌కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా… గురువారం హైకోర్టు విచారించింది. అయితే వారిద్దరూ తమ వద్ద లేరని ఏపీ పోలీసులు కోర్టుకు నివేదించారు.
రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేసిన ఇతర మావోయిస్టులను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చినట్లు తెలిపారు. ఇక వారిద్దరూ పోలీసుల ఆధీనంలోనే ఉన్నారన్న ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు…. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ…. దేవ్ జీ పోలీసు కస్టడీలో లేడని స్పష్టం చేశారు.
దేవ్ జీ, రాజిరెడ్డిలు సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో అత్యంక కీలక నేతలుగా ఉన్నది కూడా వీరే. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా కూడా హతం కావటం మావోయిస్టు పార్టీకి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
ఇంటికి తీసుకెెళ్తాం - కుటుంబ సభ్యులు
{{/usCountry}}దేవ్ జీ, రాజిరెడ్డిలు సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో అత్యంక కీలక నేతలుగా ఉన్నది కూడా వీరే. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా కూడా హతం కావటం మావోయిస్టు పార్టీకి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
ఇంటికి తీసుకెెళ్తాం - కుటుంబ సభ్యులు
{{/usCountry}}“దేవ్ జీ ఏపీ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ఊహాగానాలు వస్తున్నాయి. మరికొందరు ఎన్ కౌంటర్ లో చంపబడ్డారని చెబుతున్నారు. అందులో ఎంత నిజం ఉందో మాకు తెలియదు. స్పష్టత లేదు. మేము ఆందోళన చెందుతున్నాం. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో చేరాలని కోరుతున్నాం. దేవ్ జీని తిరిగి ఇంటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం” అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
"మేము అతనిని చూడటానికి చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాము. అతను క్షేమంగా ఉన్నాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.అతను బాగానే ఉన్నాడని నమ్ముతున్నాం" అని కుటుంబ సభ్యులు చెప్పారు.
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణం తరువాత ఇటీవల సిపిఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా దేవ్ జీ బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇతర నాయకులతో కలిసి సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి అనుకూలంగా ఉన్నారనే కథనాలు కూడా వచ్చాయి. పోలీసులు కూడా దేవ్ జీని కీలక వ్యూహకర్త అని భావిస్తున్నారు.పోలీసుల నివేదికల ప్రకారం… దేవ్ జీ తలపై రూ .1 కోటి రివార్డు ఉంది.