...
...
Next Story

RGUKT Admissions : ఇంజనీరింగ్ సీట్ల కోసం ఆర్జీయూకేటీ అడ్మిషన్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ

శ్రీకాకుళం జిల్లాలోని RGUKT - ఎచ్చెర్ల క్యాంపస్‌లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. జూన్ 23న ప్రారంభమై జూన్ 24న కూడా కొనసాగుతుందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.

Published on: Jun 23, 2026, 20:08:58 IST
Advertisement

రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం(RGUKT) శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల క్యాంపస్‌లో ఆరేళ్ల సమగ్ర ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. ఈ ప్రవేశాల ప్రక్రియ జూన్ 24 కూడా కొనసాగుతుందని విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు. రెండు సంవత్సరాల పీయూసీ, ఆపై నాలుగేళ్ల బీటెక్ ఇంజనీరింగ్‌తో కూడిన ఈ కోర్సుకు విద్యార్థుల్లో భారీ డిమాండ్ నెలకొంది.

ఆర్జీయూకేటీ అడ్మిషన్స్
ఆర్జీయూకేటీ అడ్మిషన్స్

ఈ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలు జూన్ 23 నుంచి జూన్ 24గా ఉన్నాయి. సుమారు 1,000 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అర్హులు. క్యాంపస్ లోనే కౌన్సెలింగ్ ఉంటుంది.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్లు, టీసీ, ఫొటోలు తదితర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త విద్యాసంవత్సరం తరగతులు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

మెుదటిరోజు పదో తరగతి బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు, ప్రతిభ కనబరిచిన అర్హులైన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఎచ్చెర్ల క్యాంపస్‌కు భారీగా తరలివచ్చారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రత్యేక మెరిట్ జాబితాను రూపొందించి ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు వరంగా మారింది. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం తరఫున నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలు లభిస్తాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ప్రతి ఏటా దేశ, విదేశీ ప్రముఖ కంపెనీల్లో ఇక్కడి విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe