డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC) 2027 జులై టర్మ్‌కు సంబంధించి 8వ తరగతి ప్రవేశాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆర్ఐఎంసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2026 (RIMCEE-2026) ద్వారా ఈ అడ్మిషన్లను భర్తీ చేయనున్నారు. తొలి దశ రాత పరీక్ష బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుండగా.. తదుపరి దశలైన వైవావోస్, వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఆర్‌ఐఎంసీ యాజమాన్యం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తుంది. అర్హత కలిగిన బాలురు, బాలికలు గడువులోగా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 7వ తరగతి చదువుతున్న లేదా ఇప్పటికే 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు (బాలురు, బాలికలు) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జులై 1, 2027 నాటికి అభ్యర్థి వయస్సు 12½ నుంచి 14 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 02-07-2013 నుండి 01-01-2015 మధ్య జన్మించి ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబరు 1న ప్రారంభమయ్యాయి. దరఖాస్తు సమర్పణకు ఆఖరి తేదీ సెప్టెంబరు 30గా(సాయంత్రం 5:00 వరకు) ఉంది. ఫీజు చెల్లింపు చివరి సమయం 30 సెప్టెంబరు 2026 (రాత్రి 11:50 వరకు) వరకు ఉంటుంది. ఆలస్య రుసుముతో అప్లై చేసుకునే అవకాశం 1 అక్టోబరు నుంచి 07 అక్టోబరు 2026 వరకు ఇస్తారు. ఇక అప్లికేషన్ కరెక్షన్ విండో 9 అక్టోబరు నుంచి 11 అక్టోబరు 2026 వరకు తెరిచి ఉంటుంది.
రాత పరీక్ష తేదీ 6 డిసెంబరు 2026, స్టేజ్-1 ఫలితాల విడుదల 20 ఫిబ్రవరి 2027లోపు వస్తాయి. ఇంటర్వ్యూ / వైవా వోస్ ఏప్రిల్ 2027 ఉండవచ్చు. దరఖాస్తు రుసుము జనరల్ / ఓబీసీ-ఎన్‌సీఎల్ / డిఫెన్స్ అండ్ ఎక్స్-సర్వీస్‌మెన్ పిల్లలకు రూ.1,000, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు రూ.750గా ఉంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్లో ప్రాథమిక వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి ఫొటోగ్రాఫ్, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, నివాస సర్టిఫికెట్, స్కూల్ బోనాఫైడ్/స్టడీయింగ్ సర్టిఫికెట్, ఎడమ చేతి బొటనవేలు ముద్ర, క్యాస్ట్ సర్టిఫికెట్ (వర్తించే వారికి) స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
{{/usCountry}}రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్లో ప్రాథమిక వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి ఫొటోగ్రాఫ్, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, నివాస సర్టిఫికెట్, స్కూల్ బోనాఫైడ్/స్టడీయింగ్ సర్టిఫికెట్, ఎడమ చేతి బొటనవేలు ముద్ర, క్యాస్ట్ సర్టిఫికెట్ (వర్తించే వారికి) స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
{{/usCountry}}తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు అనుకూలమైన నగరాన్ని ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవచ్చు. ఈ ప్రవేశ ప్రక్రియలో ఎటువంటి ప్రత్యేక రిజర్వేషన్ల విధానం ఉండదు. కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ టెస్ట్‌లలో ప్రతి దశలోనూ విడివిడిగా అర్హత సాధించడం తప్పనిసరి. తుది అడ్మిషన్ల కేటాయింపులో బాలురకు రాష్ట్రాల వారీగా, బాలికలకు జోన్ల వారీగా మెరిట్ ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తారు.