రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు : ఐపీఎస్ అధికారి సునీల్‌ నాయక్‌ అరెస్ట్

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహర్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Published on: Feb 23, 2026, 11:42:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రఘురామ కృష్ణంరాజు(ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లో అదుపులోకి తీసుకున్నారు.

కస్టోడియల్‌ టార్చర్‌ కేసు
కస్టోడియల్‌ టార్చర్‌ కేసు

వైసీపీ హయాంలో సీఐడీ డీఐజీగా సునీల్ నాయక్ బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో రఘురామ కృష్ణంరాజు అరెస్ట్… ఆ తర్వాతి పరిణామాల్లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బీహార్ క్యాడర్ కు చెందిన ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ అయ్యాయి. తాజాగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ధ్రువీకరించారు.

2021లో కోవిడ్ -19 ఉధృతంగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేశారు. అరెస్ట్ తర్వాత పోలీసు కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేశారని రాజు ఆరోపించారు. ప్రధానంగా సునీల్ కుమార్ తో పాటు మరికొందరు అధికారులపై ఆరోణపలు చేశారు.

2024లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చాక ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. రఘురామ ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కస్టోడియర్ టార్చర్ కేసులో భాగంగా అప్పట్లో పని చేసిన కొందరు అధికారులతో పాటు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు. సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌తో పాటు సునీల్ నాయక్ కూడా ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించారని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.

ఈ కేసులో భాగంగా అప్పటి సీఐడీ విభాగంలో పని చేసిన సునీల్ నాయక్ ఏపీలో తన డిప్యూటేషన్ ముగియడంతో తిరిగి తన సొంత క్యాడర్ అయిన బీహార్‌కు వెళ్ళిపోయారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు గతంలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ… ఆయన్నుంచి స్పందన లేదనట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ కేసులో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్‌ను కూడా ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ పొడిగింపు:

ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్‌ కేసు పూర్తి లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్‌ కొనసాగనుంది.

సునీల్‌ కుమార్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అంతేకాకుండా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. పలుమార్లు సస్పెన్షన్ గడువుగా కూడా పొడిగించింది.

సునీల్ కుమార్ గతంలో సీఐడీ అడిషనల్ డీజీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై వచ్చిన ఫిర్యాదులు, ముఖ్యంగా కస్టోడియల్ హింసకు సంబంధించిన ఆరోపణలు ఆయన సర్వీసులో పెద్ద మలుపుగా మారాయి. మరోవైపు పీవీ సునీల్ కూడా తనపై నమోదైన అభియోగాలపై న్యాయపోరాటం చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More