కాకినాడ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసు విచారణలో కీలక పురోగతి లభించింది. ఈ దారుణ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు, రైఫిల్ షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్‌ను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ విషాద ఘటనలో ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్స్ రెడ్డి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో చిన్నారి రియాన్స్ రెడ్డి ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, నూకరాజు, మీనా, సౌజన్య నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మొదట ఈ ఘటనపై రాజమహేంద్రవరంలో కేసు నమోదవ్వగా, ఘటన వెనక ఉన్న అసలు కారణాలు విచారణలో బయటపడ్డాయి.
పోలీసులు జరిపిన తనిఖీల్లో రెండు వేర్వేరు సూసైడ్ నోట్‌లు లభించాయి. ఒక లేఖ నూకరాజు వద్ద లభించగా, మరొకటి ఆయన కుమార్తె సౌజన్యకు చెందిన స్కూటీలో దొరికింది. సాధిక్ ఖాన్ తమను తీవ్రంగా మానసిక, శారీరక వేధింపులకు గురిచేశాడని, ఆస్తిపై కన్నువేసి బ్లాక్‌మెయిల్ చేశాడని లేఖల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, సౌజన్యపై బలవంతంగా మతం మారాలని సాధిక్ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు లేఖల ద్వారా స్పష్టమైంది. బాధితురాలు సౌజన్య మామ భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ఎస్పీ తెలిపారు.
సామూహిక ఆత్మహత్యల అనంతరం నిందితుడు సాధిక్ ఖాన్ పరారయ్యాడు. అతడి కోసం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పోలీసులతో కూడిన 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఐదు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మేరఠ్‌లో సాధిక్ ఆచూకీ కనుగొన్నారు. అక్కడ తన స్నేహితులకు తన ఫోన్, డబ్బు పోయాయని మాయమాటలు చెప్పి తలదాచుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మేరఠ్ స్థానిక కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై అతడిని కాకినాడకు తీసుకువచ్చారు.
సాధిక్ ఖాన్‌పై హత్య, బలవంతపు మతమార్పిడి, ఆత్మహత్యకు ప్రేరేపించిన తీవ్రమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి, తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. కస్టడీలో విచారిస్తే వేధింపులకు సంబంధించిన మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
{{/usCountry}}సాధిక్ ఖాన్‌పై హత్య, బలవంతపు మతమార్పిడి, ఆత్మహత్యకు ప్రేరేపించిన తీవ్రమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి, తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. కస్టడీలో విచారిస్తే వేధింపులకు సంబంధించిన మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
{{/usCountry}}ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు, బెదిరింపులు ఎదురైనప్పుడు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ధైర్యంగా పోలీసులను ఆశ్రయిస్తే తగిన రక్షణ కల్పిస్తామని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.