SCR Tirupati Okha Express : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి గుజరాత్‌లోని ద్వారకా సమీపంలో ఉన్న ఓఖా వరకు కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ…. తిరుపతి - ఓఖా - తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్(రైలు నంబర్లు 19559/19560) రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
సర్వీసుల వివరాలు - టైమింగ్స్
- రైలు నంబరు 19559 (తిరుపతి - ఓఖా): ఈ రైలు ప్రతి గురువారం తిరుపతిలో బయలుదేరుతుంది. మే 14, 2026 నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
- రైలు నంబరు 19560 (ఓఖా - తిరుపతి): ఈ రైలు ప్రతి సోమవారం ఓఖాలో బయలుదేరుతుంది. మే 11, 2026 నుంచే ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
- తిరుపతిలో గురువారం ఉదయం 08:15 గంటలకు బయలుదేరి…. శనివారం ఉదయం 11:50 గంటలకు ఓఖా చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో ఓఖాలో సోమవారం రాత్రి 23:55 గంటలకు బయలుదేరి, బుధవారం రాత్రి 23:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఈ వీక్లీ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల్లోని బాసర, నిజామాబాద్, కామారెడ్డి, బొల్లారం, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్, తాడిపత్రి, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో 1 సెకండ్ ఏసీ కోచ్, 3 థర్డ్ ఏసీ బోగీలు, 10 స్లీపర్ బోగీలు, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.
ఈ రైలు అందుబాటులోకి రావటంతో…. తిరుపతి నుంచి ద్వారకా వెళ్లే యాత్రికులకు, అలాగే నిజామాబాద్, కాచిగూడ ప్రయాణికులకు గుజరాత్ వెళ్లడం మరింత సులభతరం కానుంది.
{{/usCountry}}ఈ రైలు అందుబాటులోకి రావటంతో…. తిరుపతి నుంచి ద్వారకా వెళ్లే యాత్రికులకు, అలాగే నిజామాబాద్, కాచిగూడ ప్రయాణికులకు గుజరాత్ వెళ్లడం మరింత సులభతరం కానుంది.
{{/usCountry}}