Summer Special Trains 2026 : వేసవి సెలవుల వేళ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు, అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు గాను వివిధ గమ్యస్థానాల మధ్య మరిన్ని 'సమ్మర్ స్పెషల్' రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా నాందేడ్స విశాఖపట్నం నుంచి ఢిల్లీ (నిజాముద్దీన్) వైపు వెళ్లే వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.
నాందేడ్ - నిజాముద్దీన్ స్పెషల్ రైళ్లు:

మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక సర్వీసులను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది.
- రైలు నంబర్ 07660: మే 22న (శుక్రవారం) ఉదయం 06:35 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి... మరుసటి రోజు (శనివారం) మధ్యాహ్నం 14:30 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07661: తిరుగు ప్రయాణంలో మే 25న (సోమవారం) తెల్లవారుజామున 01:25 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి, మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 09:45 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
- ఈ రైళ్లు ఆదిలాబాద్, నాగ్‌పూర్, రాణి కమలాపతి, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో కేవలం స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి.
విశాఖపట్నం - నిజాముద్దీన్ స్పెషల్ రైళ్లు:
విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.
- రైలు నంబర్ 08513: మే 21న (గురువారం) సాయంత్రం 17:40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, శనివారం ఉదయం 11:40 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 08514: తిరుగు ప్రయాణంలో మే 24న (ఆదివారం) రాత్రి 23:55 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి, మంగళవారం రాత్రి 22:40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
- దువ్వాడ, అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, బలార్షా, నాగ్‌పూర్, రాణి కమలాపతి, ఝాన్సీ మరియు ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతాయి. ఇవి కూడా స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో నడుస్తాయి.
ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకుని తమ ప్రయాణాలను సురక్షితంగా సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. టికెట్ బుకింగ్ మరియు ఇతర వివరాల కోసం ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా రైల్వే విచారణ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
{{/usCountry}}ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకుని తమ ప్రయాణాలను సురక్షితంగా సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. టికెట్ బుకింగ్ మరియు ఇతర వివరాల కోసం ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా రైల్వే విచారణ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
{{/usCountry}}