...
...
Next Story

AP Panchayat Elections : పంచాయతీ ఎన్నికల రెండో దశకు నోటిఫికేషన్ జారీ - ఈనెల 18 నుంచి నామినేషన్లు

AP Panchayat Elections Phase 2 Notification : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నోటిఫికేషన్‌ను ఎస్ఈసీ విడుదల చేసింది. నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించి…. నవంబర్ 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

Published on: Nov 16, 2026, 13:35:34 IST
Advertisement

AP Panchayat Elections Phase 2 Notification :రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సోమవారం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

రెండో దశ పంచాయతీ ఎన్నికలు - పూర్తి షెడ్యూల్ :

  • నవంబర్ 18 నుంచి 20 వరకు : ఆయా పంచాయతీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ.
  • నవంబర్ 21 : ఉదయం 8 గంటల నుంచి అందిన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ నిర్వహిస్తారు.
  • నవంబర్ 22 : తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థులు సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
  • నవంబర్ 23 : వచ్చిన అప్పీళ్లను అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారు.
  • నవంబర్ 24 : పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
  • నవంబర్ 24 (మధ్యాహ్నం 3 గంటల తర్వాత) : ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
  • నవంబర్ 29 (ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు) : పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు.
  • నవంబర్ 29 (మధ్యాహ్నం 2 గంటల నుంచి) : పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాల వెల్లడి అనంతరం అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు.
  • నవంబర్ 30 : ఏవైనా కారణాలతో పోలింగ్ నిలిచిపోయిన లేదా అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించి…. ఆ తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు.

పంచాయతీ ఎన్నికల రెండో దశకు నోటిఫికేషన్ జారీ
పంచాయతీ ఎన్నికల రెండో దశకు నోటిఫికేషన్ జారీ

రెండో దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో విశాఖపట్నం జిల్లాకు మినహాయింపు ఇచ్చారు. ఈ దశలో విశాఖ జిల్లాలో ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాబోయే మూడో దశ ఎన్నికల్లో భాగంగా విశాఖపట్నం జిల్లాలోని నాలుగు మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నోటిఫికేషన్ వెలువడటంతో గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పాటు రాజకీయ సందడి ఒక్కసారిగా వేడెక్కింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks