...
...
Next Story

సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ టికెట్ ధర ఎంత? ఏ రోజుల్లో రష్ ఉంటుంది?

సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఈ ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారు. ఈ రూట్‌లో టికెట్ ధర ఎంత? ఏ రోజుల్లో రద్దీ ఉంటుందో చూద్దాం.

Published on: Feb 22, 2026, 19:11:27 IST
Advertisement

వందే భారత్ ట్రైన్స్ వచ్చాక చాలా మంది ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తున్నారు. జర్నీలో ఎక్కువగా అలసిపోకుండా నేరుగా సొంతూళ్లకు వెళ్తున్నారు. అంతేకాదు వేగంగా సిటీలను ఈ రైళ్లు కనెక్ట్ చేస్తాయి. దీంతో వీటిలో ప్రయాణించేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో వందే భారత్ రైలుకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్
సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్

ఈ రూట్‌లో ఉన్న డిమాండ్ ఆధారంగానే ఇటీవల కోచ్‌లను పెంచారు. నిజానికి ఈ రూట్‌లో మెుదట 16 కోచ్‌లతోనే వందే భారత్ రైళ్లు నడిచాయి. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కోచ్‌లను 20కి పెంచారు. ఇందులో ఏసీ చైర్ కార్‌కోచ్‌లు 18 కాగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కోచ్‌లు రెండు ఉన్నాయి. దీంతో సీటింగ్ కెపాసిటీ.. 1128 నుంచి 1440కు పెరిగింది. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ ప్రారంభించినప్పటి నుంచి ఆక్యుపెన్సీకి మించిన డిమాండ్‌తో నడుస్తోంది. దీంతో కోచ్‌లు పెంచినట్టుగా రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రూట్‌లో సాధారణంగా వీకెండ్స్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది శుక్రవారం, శనివారం ఈ రూట్‌లలో ఎక్కువగా ప్రయణిస్తుంటారు. తిరిగి ఆదివారం సికింద్రాబాద్‌కు రిటర్న్ వస్తుంటారు. అందుకే ఈ రోజుల్లో రష్ ఎక్కువగా ఉంటుంది. విశాఖ నుంచి కూడా వీకెండ్స్‌లో చాలామంది హైదరాబాద్‌కూ ఈ రూట్ ఉపయోగించుకుని వస్తారు.

రైలు నంబర్ 20707 (సికింద్రాబాద్ - విశాఖపట్నం) సికింద్రాబాద్‌లో 05:00 గంటలు బయలుదేరుతుంది. విశాఖపట్నంలో 1:50 గంటలు చేరుకుంటుంది. రైలు నంబర్ 20708 (విశాఖపట్నం - సికింద్రాబాద్) విశాఖపట్నంలో మధ్యాహ్నం 02:30 గంటలు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌కు రాత్రి 11:25 గంటలకు చేరుకుంటుంది. దీంతో వీకెండ్స్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక పండుగల సమయాల్లో ఈ రూట్‌లో టికెట్ దొరకడం కష్టమనే చెప్పాలి.

ఈ వందే భారత్‌ రైతులో రెండు సీటింగ్ తరగతులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,750, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.3,200 ధరగా ఉంది. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌లో ఇటీవలే మార్పు జరిగిన విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe