AP Cyclone Damage Assessment : అర్నబ్ తుఫాన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వ పరిశీలనా బృంధం రాష్ట్రానికి వచ్చింది. ఇందులో భాగంగా శనివారం ఈ బృందం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించింది. అర్నబ్ తుపాన్ వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయిక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందం రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ అధికారులు తుఫాన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందస్తు సన్నద్దత చర్యల గురించి కేంద్ర బృందానికి వివరించారు.
ప్రాణనష్టం తగ్గించగలిగాం…..
అర్నబ్ గురించి ఆరు రోజుల ముందు నుంచే ప్రజలను నిరంతరం అప్రమత్తం చేశామని… ఆర్టీజీఎస్ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) నుంచి ప్రజలకు నిరంతరం తుఫాన్ హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు.
“7.23 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు నిరంతరం తుపాన్‌కు సంబంధించి హెచ్చరికలు జారీ చేశాం. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రజలు ఎవ్వరూ కూడా తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేయడంతో పాటు రహదారులపై వాహనాల రాకపోకలను నిలిపేశాం, తద్వారా ప్రాణ నష్టం పెద్దగా వాటిల్లకుండా చేయగలిగాం. తుపాన్ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వివిధశాఖల మధ్య సమన్వయంతో పనిచేసేలా ఆర్టీజీఎస్ నుంచి పర్యవేక్షించాం” అని కేంద్ర బృందానికి వివరించారు.
రూ.4,764 కోట్ల నష్టం….
అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రంలో రూ.4,764 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. 4.63 లక్షల మంది రైతులకు చెందిన 3.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 23,383 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 2,491 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రధాన రహదార్లు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. 7,382 ఇళ్లు దెబ్బతిన్నాయి. 12 జిల్లాల్లో తుపాన్ వల్ల నష్టం వాటిల్లిందని అయితే కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. విద్యుత్తు రంగానికి భారీగా నష్టం వాటిల్లిందన్నారు.
{{/usCountry}}అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రంలో రూ.4,764 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. 4.63 లక్షల మంది రైతులకు చెందిన 3.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 23,383 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 2,491 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రధాన రహదార్లు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. 7,382 ఇళ్లు దెబ్బతిన్నాయి. 12 జిల్లాల్లో తుపాన్ వల్ల నష్టం వాటిల్లిందని అయితే కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. విద్యుత్తు రంగానికి భారీగా నష్టం వాటిల్లిందన్నారు.
{{/usCountry}}ఆర్టీజీఎస్ ప్రెజెంటేషన్ పట్ల పూర్తిగా సంతృప్తి చెందిన కేంద్ర బృందం…. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత ఆర్థిక సాయం త్వరగా అందేలా తమ వంతు కృషి చేస్తామని తెలిపింది. తక్షణ సహాయక నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తామని చెప్పింది.