తిరుమల కల్తీ నెయ్యి కేసులో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్!
తిరుమల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మరికొన్ని రోజుల్లో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.
తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం జనవరి చివరి నాటికి రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఏడాదికి పైగా కొనసాగుతున్న దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. ఆధారాల సేకరణ, వాంగ్మూలాల నమోదు, పత్రాల పరిశీలన వంటి కీలక ప్రక్రియలు చాలావరకు పూర్తయ్యాయి. ప్రస్తుతం సిట్ తుది చట్టపరమైన పరిశీలన, డాక్యుమెంటేషన్ పనిలో నిమగ్నమై ఉందని తెలుస్తోంది. రాబోయే రెండు వారాల్లో నెల్లూరు ఏసీబీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.

సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు గత వారం తిరుపతిలోని ఎస్ఐటీ కార్యాలయాన్ని సందర్శించి ఎస్ఐటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. దర్యాప్తు పురోగతిని, కేసు ఫైళ్లను పరిశీలించారు. ఈ సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, డీఐజీ మురళీ రాంబా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సలహాదారు సత్యేన్ కుమార్ పాండా తదితరులు పాల్గొన్నారు.
ఈ కేసులో సిట్ ఇప్పటివరకు 36 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో చాలా మందిని అరెస్టు చేయగా, మరికొందరిని నోటీసులు జారీ చేసి కస్టడీలో ప్రశ్నించారు. కల్తీ నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేయడంలో కొంతమంది టీటీడీ అధికారులు, డెయిరీ నిపుణులు కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఏ-34గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇటీవల నెల్లూరు ఏసీబీ కోర్టు ప్రాసిక్యూషన్ సమర్పించిన వాదనలతో ఏకీభవించి కొట్టివేసింది.
కేసు కీలక దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో కొంతమంది వ్యక్తుల అరెస్టును కూడా సిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యల తర్వాత సమగ్ర ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని, ఆ తర్వాత దర్యాప్తుపై వివరణాత్మక నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని అధికారులు చెబుతున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ కేసును సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆ సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డితోపాటుగా కొందరు బోర్డు సభ్యులను సిట్ విచారణ చేసింది. టీటీడీకి కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా ఇప్పటికే సిట్ కోర్టుకు తెలిపింది. మరికొన్ని అరెస్టు ఉంటే.. ఎవరిని చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


