పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు వన్-వే స్పెషల్ రైళ్ళను నడపడంతో పాటు, ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ళ సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
రైలు నెంబర్ 07077 (చర్లపల్లి - ప్రయాగ్‌రాజ్) :

ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 25 ఆదివారం ఉదయం 10:00 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 10:35 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది.
ఈ రైలు కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, చంద్రపూర్, నాగపూర్, జుఝార్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కట్నీ, సత్నా, మాణిక్‌పూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.
రైలు నెంబర్ 07078 (హైదరాబాద్ - పార్వతీపురం) :
ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 27 మంగళవారం మధ్యాహ్నం 15:30 (3:30) గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, మరుసటి రోజు (బుధవారం) ఉదయం 07:00 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
మార్గమధ్యంలో ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది.
పొడిగించిన ప్రత్యేక రైళ్ళ వివరాలు :
రైలు నెంబర్ 07651 (జాల్నా - ఛప్రా): బుధవారం నడిచే ఈ ప్రత్యేక రైలు సర్వీసులను నవంబర్ 11, నవంబర్ 18, నవంబర్ 25 తేదీల్లో మరో 3 ట్రిప్పుల పాటు పొడిగించారు.
రైలు నెంబర్ 07652 (ఛప్రా - జాల్నా): శుక్రవారం నడిచే ఈ రైలు సర్వీసులను నవంబర్ 13, నవంబర్ 20, నవంబర్ 27 తేదీల్లో మరో 3 ట్రిప్పుల పాటు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పండగ ప్రయాణాలు చేసేవారు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
{{/usCountry}}రైలు నెంబర్ 07652 (ఛప్రా - జాల్నా): శుక్రవారం నడిచే ఈ రైలు సర్వీసులను నవంబర్ 13, నవంబర్ 20, నవంబర్ 27 తేదీల్లో మరో 3 ట్రిప్పుల పాటు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పండగ ప్రయాణాలు చేసేవారు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
{{/usCountry}}