...
...
Next Story

SCR Summer Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - సికింద్రాబాద్ ,గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు, పూర్తి లిస్ట్

SCR Summer Special Trains 2026 : వేసవి రద్దీని తగ్గించేందుకు బిలాస్‌పూర్ - యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, గుంతకల్ మీదుగా ఈ ట్రైన్స్ నడుస్తాయి. జూలై 2 వరకు 10 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

Published on: Jun 4, 2026, 14:43:08 IST
Advertisement

SCR Summer Special Trains 2026 : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుండి బెంగళూరు సమీపంలోని యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

ఏపీ తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు
ఏపీ తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ మీదుగా ప్రయాణిస్తాయి. జూలై 2వ తేదీ వరకు మొత్తం 10 సర్వీసులను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లలో థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

  • బిలాస్‌పూర్ - యెలహంక ప్రత్యేక రైలు(రైలు నంబర్ 08261) : ఈ రైలు 2026 జూన్ 3 నుండి జూలై 1 వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం 14.00 గంటలకు బిలాస్‌పూర్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు (గురువారం) రాత్రి 19.00 గంటలకు యెలహంక చేరుకుంటుంది. ఈ రూట్‌లో మొత్తం 5 సర్వీసులు నడుస్తాయి.
  • యెలహంక - బిలాస్‌పూర్ ప్రత్యేక రైలు(రైలు నంబర్ 08262) : ఈ రైలు 2026 జూన్ 4 నుండి జూలై 2 వరకు ప్రతి గురువారం రాత్రి 21.30 గంటలకు యెలహంకలో బయలుదేరుతుంది. శనివారం తెల్లవారుజామున 03.30 గంటలకు బిలాస్‌పూర్ చేరుకుంటుంది. ఈ రూట్‌లో కూడా 5 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

రైళ్లు ఆగే ప్రధాన స్టేషన్లు (హాల్ట్స్)

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe