...
...
Next Story

SCR Summer Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్ - శ్రీకాకుళం మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

SCR Summer Special Trains : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు మరో అప్డేట్ వచ్చేసింది. వేసవి రద్దీ పెరుగుతున్న వేళ సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్డు మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది.

Published on: Mar 29, 2026, 05:13:03 IST
Advertisement

వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

వేసవి ప్రత్యేక రైళ్లు….

సికింద్రాబాద్ - శ్రీకాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్
సికింద్రాబాద్ - శ్రీకాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

ఏప్రిల్ నుంచి జూన్ 28వ తేదీ వరకు ఈ వేసవి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్స్ ఆగుతాయి. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లే రైలు ( ట్రైన్ నెంబర్ 07425) ఏప్రిల్ 5వ తేదీ నుండి ప్రతి ఆదివారం రాత్రి 11:15 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు సాయంత్రం 5:30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. ఏప్రిల్ 5,12,18,26, మే 3,10, 17,24,31, జూన్ 7,14, 21,28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మొత్తం 13 ట్రిప్పుల పాటు ఈ సేవలు కొనసాగుతాయి.

ఇక తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు ( ట్రైన్ నెంబర్ 07426) ప్రతి సోమవారం రాత్రి 7:30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.మొత్తం 13 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఆగే స్టేషన్లు ఇవే….

ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం మరియు చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా కోరింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks